27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Grand Musical Concert : వేగేశ్న ఫౌండేషన్, న్యూజెర్సీ తెలుగు అసొసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్

    Date:

    Grand Musical Concert
    Grand Musical Concert

    Grand Musical Concert : అమెరికాలో తెలుగు వాళ్లకు కొదువలేదు. ఇక కొన్ని చోట్లయితే అమెరికాలో ఉన్నామా..ఆంధ్రాలో ఉన్నామా అనే భావన కలుగుతుందనడంలో సందేహం లేదు. మన తెలుగు వాళ్ల ఆనందం కోసం పలు ప్రోగామ్స్ నిర్వహిస్తుంటాయి స్వచ్ఛంద, ఇతర సంస్థలు. అలాంటిదే వేగేశ్న ఫౌండేషన్. సేవా కార్యక్రమాల్లో ముందుండడమే కాదు భారతీయ కళల ప్రోత్సాహానికి ఈ ఫౌండేషన్ విశేష కృషి చేస్తోంది. అందులో భాగంగానే న్యూజెర్సీ తెలుగు అసొసియేషన్ తో కలిసి అమెరికాలో ‘గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్’ నిర్వహించబోతోంది.

    ఈ నెల 15న సాయంత్రం 4.30 గంటల నుంచి ఓమ్ శ్రీ సాయి బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, 285 రోడే హాల్ రోడ్, మన్రో టౌన్ షిప్ టౌన్ షిప్, న్యూజెర్సీ 08831 ప్రాంతంలో ఈ సంగీత విభావరిని ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు శ్రీ రామకృష్ణ యనమంద్ర, సింగర్ లలిత రామకృష్ణ తమ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశమే కాదు భోజనం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ కు హాజరు కావాలనుకునే వారు మంజుభార్గవ: (973)715-8944, బిందు మాదిరాజు: (732)609-1836, ఉషా రావిళ్ల: (732)-9037, స్వాతి అట్లూరి: (732)429-2948, అనురాధ అరుణ్: (732)585-0583, శ్రీనివాస్ భార్తవరపు:(347)668-9861, క్రిష్ణవేణి: (732)692-4915, ఉషారాణి చింత:(732)692-0362, విజయ సప్ప:(646)945-3243లను సంప్రదించవచ్చు. కాగా, ఈ సంగీత కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని  వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీరామరాజు కోరారు.

    ‘వేగేశ్న ఫౌండేషన్’ గురించి..

    సమాజంలో నిర్లక్ష్యానికి గురైన దివ్యాంగ పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం 1988 సంవత్సరంలో వేగేశ్న ఫౌండేషన్ ను వంశీ రామరాజు స్థాపించారు. తెలంగాణలోని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంటూర్ లో దీనిని నెలకొల్పారు. ఈ సంస్థ ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ పిల్లలకు విద్యా, నివాస, శారీరక చికిత్స, శస్త్రచికిత్సల కోసం ప్రారంభించబడిన ఈ ఫౌండేషన్..ఎంతో మంది దాతల సహకారంతో సమాజంలో మార్పు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతోంది.

    ‘వేగేశ్న ఫౌండేషన్’ అమెరికాలో సంగీత కచేరిలను ఏర్పాటు చేసి తమ సంస్థ ద్వారా అందజేసే సేవలకు నిధులను సేకరిస్తోంది. ముఖ్యంగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తూ వారి సహకారంతో దివ్యాంగ పిల్లలను ఆదుకుంటోంది. సామాజిక సేవ మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు సంగీత ప్రియుల కోసం సంగీత విభావరులు ఏర్పాటు చేయడం విశేషం.

    ‘‘సమాజంలోని నిరుపేద పిల్లల జీవితాలను మెరుగుపరిచే ప్రయాణంలో వేగేశ్న ఫౌండేషన్ ముందుకు వచ్చింది.. సానుకూల మార్పును తీసుకురావడానికి, వారికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి భారతదేశమే కాదు విదేశాల్లో ఉన్నవాళ్లు సైతం మద్దతు ఇస్తున్నారని వారందరికీ  కృతజ్ఞతలు..’’ అని నిత్యం వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు చెప్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...