New Year Celebrations : నూతన సంవత్సరం సందర్భం గా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. ఏపీ లోని తిరుమల, శ్రీశైలం, సింహాచలం తో పాటు తెలంగాణలో యాదాద్రి, వేముల వాడ,భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తు లు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలు గు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇతర ప్రాంతా ల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారి కృపాకటాక్షాలు తమపై ఉండా లని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. వారికి రంగా నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్ తెలిపారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కొత్త ఏడాది తొలి రోజు కావడంతో మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో అర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశా రు. ధర్మగుండంలో స్నానాలు ఆరించిన భక్తులు స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుం టున్నారు. భక్తుల కు ఎలాంటి ఇబ్బందులకు లేకుం డా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయా నికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు.