39.4 C
India
Saturday, June 6, 2026
More

    Bangladesh Vs Sri Lanka : శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘన విజయం 

    Date:

    Bangladesh Vs Sri Lanka
    Bangladesh Vs Sri Lanka

    Bangladesh Vs Sri Lanka : శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య డల్లాస్ లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న బంగ్లా బౌలర్లపై లంక ఓపెనర్ పథూమ్ నిస్సంకా..బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే 47 పరుగులు చేయగా..  మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 124/9 వికెట్లతో ఇన్సింగ్స్ ముగించింది.

    బంగ్లా బౌలర్లలో రిషద్ హోసెన్, ముస్తాపిజుర్ రెహమన్ చెరో మూడు వికెట్లు తీసి లంక బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఓపెనర్లను లంక బౌలర్లు 0, 3 పరుగులకే పెవిలియన్ కు పంపారు. కెప్టెన్ నజ్ముల్ షాంటో కూడా 7 పరుగులకే ఔట్ కాగా.. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ 36 పరుగులు, మిడిలార్డర్ బ్యాటర్ హృదోయ్ 20 బంతుల్లోనే నాలుగు సిక్సులు, ఒక ఫోర్ తో 40 పరుగులు చేసి బంగ్లా విజయాన్ని ఖాయం చేశారు.

    లంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు వికెట్లు తీయగా.. వహిందు హసరంగా రెండు వికెట్లు తీశారు. కాగా మొదటి ఇన్సింగ్స్ లో కేవలం 124 పరుగులు చేయడంతో బంగ్లా చివరి బ్యాటర్లు సమయోచింగా ఆడి విజయాన్ని అందించారు. .113 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా.. బంగ్లా సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా 13 పరుగులతో తీవ్ర ఒత్తిడో మ్యాచ్ ను గెలిపించాడు.

    బంగ్లాదేశ్ విజయంతో పాయింట్ల పట్టికలో బోణి కొట్టగా.. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిపోయిన శ్రీలంక, బంగ్లాతో ఓటమితో ఇంటి బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నెదర్లాండ్స్, నేపాల్ తో గెలిచినా కూడా మిగతా జట్ల బలబలాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కొత్త కెప్టెన్ గా వహిందు హసరంగాను సెలెక్ట్ చేసినా లంక తీరు ఏ మాత్రం మారలేదు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మధ్య సూపర్ 8 కోసం తీవ్ర పోటీ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Chinmay Prabhu : బంగ్లాదేశ్ లో చిన్మయ్ ప్రభు అరెస్టు

    Chinmay Prabhu : ఇస్కాన్ గురువు చిన్మయ్ ప్రభును దేశద్రోహం కేసు...

    India and Sri Lanka : భారతదేశం శ్రీలంకల మధ్య బ్రిడ్జీ ఉందా.. మళ్లీ టాపిక్ వైరల్

    India and Sri Lanka : భారతదేశం, శ్రీలంక చరిత్ర చాలా...

    IND vs BAN: బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక

    IND vs BAN:బంగ్లాదేశ్ తో టి 20 సిరీస్ కు భారత...