Raj Kapoor Rare Video : రాజ్ కపూర్.. ఈయన ఈ జనరేషన్ వారికీ పెద్దగా పరిచయం లేకపోయిన అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు.. ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలను పోషించాడు.. ఈయనను రణబీర్ రాజ్ కపూర్ అని కూడా పిలుస్తారు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన ఇప్పటికీ ఎందరికో ఆదర్శం..
అత్యంత ప్రతిభావంతులైన నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.. అలాగే ఆయన నిర్మాతగా కూడా పేరు గాంచాడు.. హిందీ సినీ ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ షోమ్యాన్ గానే కాకుండా చార్లీ చాప్లిన్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన తన సినీ కెరీర్ లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అలాగే 11 ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నాడు..
ఇతడు 1951లో ఆవారా సినిమాలో నటించిన నటనకు గాను ‘ప్రపంచ చలన చిత్రంలో ఆల్ టైం టాప్ టెన్ గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ లలో ఒకటిగా నిలిచారు. ఇక ఈయన కళారంగానికి చేసిన సేవలకు గాను 1971లో పద్మభూషణ్ ను అందించి సత్కరించింది.. అలాగే 1987లో ప్రభుత్వ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నాడు.
ఇలా ఈయన కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన రాజ్ కుమార్ రేర్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈయన అప్పట్లో నటించి మెప్పించిన రోల్స్ మొత్తంగా ఒక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుండడంతో ఇప్పటి జనరేషన్ రాజ్ కుమార్ గురించి ఆరా తీస్తున్నారు.