
Jallikattu : తమిళనాడులో జల్లికట్టు ఆడుకునేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడుకునే ఈ ఆటను నిలిపేయాలని పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో వివాదం రేగింది. జల్లికట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. చెన్నై లో జరిగిన ఈ ఆందోళనకు తమిళానాడు ప్రజానీకం, యువత పోటెత్తింది. దీంతో జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడు, కేంద్రం అఫిడవిట్లు అందజేశాయ. వాదనలు విన్న సుప్రీం కోర్టు జల్లికట్టుకు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లను కొట్టివేసింది.
జల్లికట్టు ప్రత్యేకత..
తమిళనాడులో కొత్త పంట వచ్చిన సందర్భంగా జనవరి రెండో వారంలో ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు (Jallikattu) జరుగుతుంది. అయితే దీని వల్ల ప్రాణాలు పోతున్నాయని పలువురు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కోర్టుల్లో పిటిషన్లు వేశారు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ తో తమిళనాడు సర్కారు ఊరట లభించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే 2014 ఇచ్చిన తీర్పును సవరించింది. 2017లో తమిళనాడు సర్కారుచేసిన చట్టాన్ని సమర్థించింది.
తమిళనాడు సంస్కృతిలో జల్లికట్టుకు ప్రత్యేకస్థానం ఉందని ఐదుగురు సభ్యులు బెంచ్ అభిప్రాయపడింది. తమిళనాడు చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టవేసింది. సుప్రీం తీర్పుపై తమిళనాడులో సంబురాలు మిన్నంటాయి. పలువురు నేతలు స్వాగతించారు. న్యాయం గెలిచిందని తెలిపారు. Jallikattu కు అనుకూలంగా గతంలో పెద్ద ఎత్తున ఆందోళనల నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు పై ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే తీర్పు సానుకూలంగా రావడంతో అంతా పండుగ వాతావరణం నెలకొంది.