26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Sabarimala Airport : అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలలో ఎయిర్ పోర్ట్.. ఇక వెళ్లడం చాలా ఈజీ

    Date:

    Sabarimala Airport : శబరిమల విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం దేశంలో విమాన ప్రయాణం ద్వారా అత్యంత వేగంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గంటలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళుతున్నారు. రైలులో వెళితే ఒక రోజు పట్టేది.. విమానంలో కేవలం గంటలో వెళ్లగలుగుతున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విమాన సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది.తిరుపతికి చేరువలోని రేణిగుంటలో విమానాశ్రయం ఉంది. అయితే కొండలు, గుట్టలతో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు విమాన ప్రయాణం లేదు. అక్కడ అడవి ఉండడంతో పర్యావరణ అనుమతులు రాక ఇన్నాళ్లు ఆలస్యమైంది. అందుకే దేశంలోని భక్తులు రైలులో రోజంతా ప్రయాణం చేసి ఆ కొండల్లో నడిచి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.

    విమానంలో శబరిమల చేరుకోవాలంటే కొచ్చి విమానాశ్రయం లేదా తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లాలి. ఆ తర్వాత కొచ్చి నుంచి శబరిమలకు రోడ్డు మార్గంలో 160 కిలోమీటర్లు ప్రయాణించాలి. తిరువనంతపురం నుంచి అయితే 170 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇప్పుడు కొట్టాయం జిల్లా ఎరుమేలిలో విమానాశ్రయం నిర్మించనున్నందున యాత్రికులకు ఇది మరింత సులువు కానుంది. గ్రీన్‌ఫీల్డ్ శబరిమల విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న కేరళ ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రామాణిక నిబంధనలకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లభించింది.

    విమానాశ్రయం పంబకు సమీపంలో నిర్మించబడుతుంది. అయితే అదే సమయంలో శబరిమల ఆలయానికి ఎటువంటి ఆటంకం కలగకుండా స్థలాన్ని ఎంపిక చేస్తారు. దూరం 45 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఎంపిక చేసిన 2,570 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ప్రతిపాదిత వ్యయం దాదాపు రూ. 3,411 కోట్లుగా తేల్చారు.

    పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియర్ చేసిన నిబంధనలతో, కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSIDC) లిమిటెడ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (EIA)ని ప్లాన్ చేసి డిజైన్ చేస్తుంది. దీంతో ఇక కేరళకు దేశంలోని భక్తులు విమానంలో వెళ్లడం ఈజీ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sabarimala : శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త

    Sabarimala : శబరిమల విచ్చేస్తోన్న భక్తులకు సులభంగా దర్శనమయ్యేందుకు వీలుగా కేరళ...

    Sabarimala : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

    Sabarimala : శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య...