Greg Chappell & Ganguly :
చాపెల్ 2005లో భారత క్రికెట్ జట్టుకు
రెండేళ్లపాటు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ. కోచ్ చాపెల్, గంగూలీకి మొదటి నుంచి పొసగలేదు. దీంతో గంగూలీ తన కెప్టెన్సీ తో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 51వ పుట్టినరోజు. ‘దాదా’గా ప్రసిద్ధి చెందిన గంగూలీ 8 జూలై 1972న కోల్‌కతాలో జన్మించారు.
భారత జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా ఉండి 2003 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
డ్రెస్సింగ్ రూమ్ లో గంగూలీ సరాదాగా తన జట్టు సభ్యులను బెదిరిస్తుండేవాడు. కానీ గంగూలీ కెరీర్ ను ముగించింది మాత్రం ఒక కోచ్.
ఆస్ట్రేలియా ఆటగాడు దాదా కెప్టెన్సీతో పాటు అతని కెరీర్‌ను కూడా దాదాపు ముగించాడు. అతడే భారత జట్టు మాజీ కోచ్, ఆస్ట్రేలియా లెజెండ్ గ్రెగ్ చాపెల్.
చాపెల్ 2005లో భారత క్రికెట్ జట్టుకు రెండేళ్లపాటు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ. చాపెల్ కోచ్ అయిన వెంటనే, గంగూలీతో అతని వివాదం మొదలైంది. దాని కారణంగా గంగూలీ తన కెప్టెన్సీని కోల్పోవలసి వచ్చింది.
అంతేకాదు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత చాపెల్ గంగూలీని జట్టు నుంచి తప్పించాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ గురించి కూడా చాపెల్ చాలా మాట్లాడాడు.
భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టు ఆడేందుకు ఒక రోజు ముందు కెప్టెన్ సౌరవ్ గంగూలీ, కోచ్ గ్రెగ్ చాపెల్‌ను యువరాజ్- కైఫ్ లలో జట్టులో ఎవరిని ఆడించాలని అడిగాడు. ఇద్దరూ ఆడతారు, మీరు ఔట్ అవుతారని చాపెల్ చెప్పాడు.
ఇది చాపెల్ మాటలు విన్న గంగూలీ ఆశ్చర్యపోయాడు. సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గంగూలీ కెప్టెన్సీకి శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేడని చాపెల్ బీసీసీఐకి లేఖ పంపాడు.
ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో ఆ తర్వాత పెద్ద దుమారమే రేగింది.
ఈ వివాదం తర్వాత గంగూలీ కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. చాపెల్ గంగూలీని సహించలేకపోయాడు. ఈ కారణంగా గంగూలీ జట్టు నుంచి ఉద్వాసనకు గురి కావాల్సి వచ్చింది.
ఆ సమయంలో జట్టులో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అనిల్ కుంబ్లే వంటి చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ క్రికెటర్లంతా కూడా చాపెల్ నియంతృత్వాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది.
చాపెల్ చర్యలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో కూడా ప్రస్తావించారు. ఛాపెల్ జట్టును విచ్ఛిన్నం చేయాలనుకున్నాడని, జట్టులోని ఇతర సభ్యులపై తన ఉద్దేశాలను రుద్దేవాడని సచిన్ తన పుస్తకంలో రాశాడు.
చాపెల్ కోచింగ్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. 2007 ప్రపంచ కప్ నుంచి భారతదేశం మొదటి రౌండ్ నిష్క్రమించిన తర్వాత, చాపెల్ ఆ పదవి నుంచి తొలగించారు.
ఆ బాధ్యతను దక్షిణాఫ్రికా వెటరన్ గ్యారీ కిర్‌స్టెర్న్‌కు అప్పగించారు. గ్యారీ కిర్‌స్టెర్న్ 2011లో భారత్‌కు ప్రపంచకప్‌ను అందించాడు.
ReplyForward
|