
అసెంబ్లీ నియోజకవర్గం : కొడంగల్
బీఆర్ఎస్: పట్నం నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి
Kodangal : మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోకవర్గాల్లో కొడంగల్ ఒకటి. 2007 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ కానిస్టెన్సీ కింద 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు ప్రస్తుతం చర్చల్లో నిలుస్తున్నాయి. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది ఇదే నియోజకవర్గం కావడం. టీటీపీ నుంచి పోటీ చేసిన ఆయన రెండు సార్లు ఈ నియోజకవర్గంలో పచ్చ జెండా ఎగురవేశారు. అందుకే ఆయనకు ఇక్కడ పట్టు ఎక్కువగా ఉంది. అయితే గత 2018లో మాత్రం టీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
కొడంగల్ అసెంబ్లీ చరిత్ర..
కొడంగల్ అసెంబ్లీ పరిధిలో కొడంగల్, కోస్గి, బొంరాస్ పేట్, దౌలతాబాద్, మద్దూర్ మండలాల ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ కానిస్టెన్సీ నుంచి 1,92,937 (2008 లెక్కల ప్రకారం) మంది ఓటర్లు ఉన్నారు. ఇక జనాభా చూసుకుంటే 2,50,792 (2001 లెక్కల ప్రకారం) మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 6 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, మూడు సార్లు స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపు సాధించారు.
రేవంత్ కే పట్టు ఎక్కువ..
నిజానికి కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ కు విడదీయలేని బంధం ఉంది. ఆయన ఇక్కడి నుంచే రెండు సార్లు అసెంబ్లీలోకి వెళ్లారు. టీడీపీలో కొనసాగుతున్న సమయంలో కొడంగల్ పై మంచి పట్టు సాధించారు రేవంత్ రెడ్డి. ఆయన అక్కడ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2009, 2014లో రాజకీయ ఉద్ధండుడుగా గుర్తింపు తెచ్చుకున్న గురునాథ రెడ్డిని ఓడించి గెలుపొందారు. అయితే ఇప్పుడు గనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన సీఎం అవుతారన్న టాక్ మొదలైంది. దీంతో ఆయన ఎలాగైనా గెలవాని చూస్తున్నారు. అందుకే తన పాత నియోజకవర్గం తనకు బాగా పట్టున్నది కొడంగల్ కాబట్టి అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటన్నారు రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అభ్యర్థి అని టాక్ వస్తున్న నేపథ్యంలో మన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని స్థానికులు కూడా ఎక్కువగానే మద్దతిచ్చేలా కనిపిస్తుంది.
పట్నం పరిస్థితి ఏంటి..?
ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే చెట్టు కొమ్మలు. ఇద్దరూ టీడీపీ నుంచే వచ్చారు. 2009 నుంచి 2014 వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు పట్నం. 2017లో టీఆర్ఎస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాత కొన్ని రోజులు ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇక 2018లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఈయనకు కూడా కొడంగల్ పై మంచి పట్టు ఉంది. ఎమ్మెల్యే గా ఆయన అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని చూపించి ఈసారి గెలుపొందాలని ఆయన అనుకుంటున్నారు.
రేవంత్ కు మాత్రం ప్రస్టేజ్ ఇష్యూ..
రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పట్నం 2018లో జెండా పాతారు. అయితే ఆయన అప్పుడున్న తెలంగాణ సెంటిమెంట్ పై గెలుపొందినట్లు వాదనలు వినిపించాయి. 2014లో టీడీపీ నుంచి రేవంత్ గెలుపొందినా, అక్కడి ఓటర్లు పార్టీని కాదని రేవంత్ కు మద్దతిచ్చారు. ఇక 2018లో రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగగా పట్నం గెలుపు దక్కించుకున్నారు. అయితే ఇప్పటి ఎన్నికలు ఎవరికి ఎలా ఉన్నా రేవంత్ కు మాత్రం ప్రస్టీజ్ ఇష్యూగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన టీపీసీసీ సభ్యుడు కాబట్టి.. అందునా గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పోరు తీవ్రంగానే ఉంటుందని చెప్పవచ్చు.