
పార్లమెంట్ నియోజకవర్గం : హుజూరాబాద్
బీజేపీ: ఈటల రాజేందర్
బీఆర్ఎస్: పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ : బల్మూరి వెంకట్
Huzurabad అసెంబ్లీ నియోజకవర్గం.. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి లక్షీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. కేసీఆర్ ఏ సభ, సమావేశం పెట్టినా హుజూరాబాద్ నుంచే ప్రారంభమయ్యేది. ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ ఇక్కడ ఏడు పర్యాయాలు (బైపోల్స్ కలుపుకొని) గెలుపు సాధించారు. నియోజవర్గం ఏర్పడినప్పటి (1957 ) నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, మరో మూడు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థు, ఒకసారి బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఈటల బీజేపీలో చేరి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మహానుభావులు పుట్టినగడ్డకు హుజూరాబాద్ తాలూకా గుర్తింపు దక్కించుకుంది. మాజీ దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు ఈ తాలుకాలోని వ్యక్తే కావడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఒడితెల రాజేశ్వర్ రావు, కేప్టన్ వీ లక్ష్మీకాంతారావు, ఇనుగాల పెద్దిరెడ్డి, వకులాభరణం కృష్ణమోహన్ వీరంతా ఈ ప్రాంతాని చెందిన వారు. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకు వస్తుంది.
హుజూరాబాద్ అసెంబ్లీ చరిత్ర..
హుజూరాబాద్ అసెంబ్లీ పరిధిలో వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కిందకు వస్తాయి.
1957 నుంచి హుజూరాబాద్ కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం ఇప్పటికీ ఏ పార్టీ చేతికి చిక్కలేదు. ఇక్కడి జనాభా గతంలో అభ్యర్థులను మారుస్తూ వచ్చేవారు. 1957లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినా తర్వాత కాంగ్రెస్ చక్రం తిప్పుతూ వచ్చింది. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించింది. హుజూరాబాద్ లో 1962 నుంచి 1983 వరకూ ‘హస్తం’ అధికారంలో ఉంది. తర్వాత ఇండిపెంట్, ఆ తర్వాత టీడీపీ మూడు సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత సుధీర్ఘంగా ఈటల రాజేందర్ 7 సార్లు (కంటిన్యూ) విజయం నమోదు చేసుకున్నారు. హుజూరాబాద్‌లో 2021 ఓటరు జాబితా ప్రకారం.. మొత్తం 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లు ఉన్నారు.
బలంగా బీజేపీ అభ్యర్థి..
టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న నియోజవకర్గం ఇప్పుడు బీజేపీ వైపు టర్న్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇక్కడ ఏడు సార్లు విజయం సాధించాడు. 2021 బైపోల్ లో బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచినా ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయారు. అయితే ఈ సారి పాడి కౌషిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగుతారని తెలుస్తోంది. అయినా ఇక్కడ ఈటలకు ఉన్న ఛరిష్మా పాడికి లేదనే చెప్పవచ్చు. గతంలో అభివృద్ధికి నోచుకోని హుజూరాబాద్.. బైపోల్ కారణంగా అభివృద్ధి చెందింది. ఇదంతా ఈటల చలవే అంటూ ఓటర్లు ఆయనకే మద్దతిచ్చారు. ఉద్యమ నాయకుడిగా ఈటలకు ఉన్న పేరు శ్రీనివాస్ కు లేకపోవడంతో ఆయన రెండో స్థానానికి పడిపోయారు.
దూసుకువస్తున్న పాడి..
ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి వ్యక్తి అయిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పలు మార్లు పోటీ చేశారు. రాజకీయాలపై లేని అవగాహన, దురుసు మాటలు ఆయనను వెనక్కి నెట్టాయని చెప్పవచ్చు. ఈ మధ్యే బీఆర్ఎస్ లో చేరిన పాడి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ సారి ఆయనకే టికెట్ అంటూ సీఎం కూడా లీకులు ఇస్తుండడంతో చాలా రోజుల నుంచి ఆయన గెలుపుకోసం కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గానికి తరుచూ వస్తూ ఇక్కడి సమస్యలు, ప్రత్యర్థి ఈటల రాజేందర్ పై కామెంట్లు చేస్తూ తన గుర్తింపును చాటుకుంటున్నాడు. అయతే ఈటలను ఢీ కొట్టేంత అనుభవం కానీ, ఆలోచన కానీ ఆయనకు లేవని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
గెలుపు ఏకపక్షమే అంటూ లీకులు..
దాదాపు 7 సార్లు విజయం సాధించిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో చరిష్మా ఉన్న నేత. లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీల నుంచి ఆయన రాజకీయంలోకి వచ్చారు. 2003లో టీఆర్ఎస్ లో చేరిన ఈటల 2004లో కమలాపురం అసెంబ్లీ నియోకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీలో ఉన్న లీడర్ ముద్దసారి దామోదర్ రెడ్డిపై భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది. అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ హుజూరాబాద్ అసెంబ్లీ కానిస్టెన్స్ లో కలిసింది. దీంతో 2009 నుంచి హుజూరాబాద్ లో ఆయన చక్రం తిప్పడం మొదలు పెట్టారు. సెకండ్ కేడర్ ఎదగకుండా చేసి ఆయనకు ప్రత్యర్థి లేకుండా చేసుకున్నారు.