
అసెంబ్లీ నియోజకవర్గం : పాలేరు
బీఆర్ఎస్: కందాల ఉపేందర్ రెడ్డి
బీఆర్ఎస్: తుమ్మల నాగేశ్వర్ రావు (కాంగ్రెస్ కు వచ్చే చాన్స్)
Paleru : రాష్ట్రంలో ఆసక్తి రేపుతున్న నియోజవకర్గాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు ఒకటి. భక్తరామదాసు ప్రాజెక్టు, సమీపంలో గోదావరితో కలిసి సస్యశ్యామలంగా ఉన్న పాలేరు నియోవకర్గం రాజకీయంగా మాత్రం ఎప్పుడూ హీట్ ను పెంచుతూనే ఉంటుంది. రాజకీయంలో కాకలు తీరిన వారు ఇక్కడి నుంచి బరిలో నిలుస్తున్నారు. తామంటే తాము విజయం సాధిస్తామని కధం తొక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలేరు రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. దాదాపుగా అన్ని పార్టీల్లోని ప్రముఖుల నజర్ పాలేరుపైనే ఉంది. ఇటు బీఆర్ఎస్, అంటు కాంగ్రెస్ రెండు పార్టీలు నియోజవకర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. నియోజవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. ఆ తర్వాత 2009 నుంచి జనరల్ మారింది. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు పార్టీలు గట్టి పట్టున్న నేతలను రంగంలోకి దింపుతున్నాయి.
పాలేరు అసెంబ్లీ చరిత్ర..
పాలేరు అసెంబ్లీ పరిధిలో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కింద ఉన్నాయి. మొత్తం లక్షా 95 వేల ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల నుంచి పాలేరు సెగ్మెంట్ జనరల్ కు కేటాయించారు. అప్పటి నుంచి ఇక్కడ రాజకీయ చదరంగా మొదలైంది. మంచి పట్టున్న నేత, ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి రాంరెడ్డి వెంకట్ రెడ్డి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 2016లో ఆయన మరణించడంతో ఆ సెగ్మెంట్ కు బైపోల్ అనివార్యమైంది. దీంతో 2016లో తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు.
2018లో జరిగిన ఎన్నికల్లో తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. దాదాపు సిట్టింగ్ లకే ఈ సారి టికెట్ అంటూ కేసీఆర్ మాటవివ్వడంతో పాలేరులో ఉపేందర్ రెడ్డే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని వినికిడి. ఒక వేళ కందాడ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగితే తుమ్మల ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగవచ్చు. షర్మిల ఈ మధ్య పార్టీ కార్యాలయం ప్రారంభించింది. ఈ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఆమె ప్రకటించింది. దీనికి తోడు సీపీఐ నుంచి తమ్మినేని వీరభద్రం బరిలోకి దిగుతానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోరుపై రాష్ట్రం యావత్తు ఉత్సుకతతో ఉంది.
కాంగ్రెస్ కేడర్ ఇక్కడ ప్రధాన తీర్పు..
పాలేరులో ఇప్పటి వరకూ కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) కలిసి ఐదు సార్లు గెలుపొందాయి. అక్కడ కాంగ్రెస్ కు కేడర్ ఎక్కువగా ఉంది. దీనికి తోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయగా కొన్ని సీట్లు సాధించుకుంది. దీంతో పాటు ఎంపీ సీటు కూడా గెలిచింది. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా బీఆర్ఎస్ లో చేరారు. అయితే మొదటి నుంచి ఇక్కడ కంగ్రెస్ చక్రం తిప్పుతూ వస్తుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి..
పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పని చేసిన కందాల నియోజకవర్గంలో తన గుర్తింపును పెంచుకుంటూ వచ్చాడు. అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాడు. అభివృద్ధిని చూసే తనను ఆదరించాలని ఆయన ప్రజలను కోరుతున్నాడు. అయితే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడం ఆయనకు మైనస్ గా మారే అవకాశం లేకపోలేదు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ పోటీ చేసి గెలుపొందారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ను వీడి.. బీఆర్ఎస్ లో చేరారు. పాలేరులో బీఆర్ఎస్ కు మొదటి నుంచి కేడర్ లేదు. కాంగ్రెస్ కేడర్ బీఆర్ఎస్ వైపునకు తిప్పుకోవడంలో ఉపేందర్ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు.
తుమ్మల వచ్చే ఛాన్స్ తక్కువే..
2016లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో అప్పటికే టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వర్ రావు ఆ పార్టీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. 2 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఆయన పని చేసింది మాత్రం రెండు సంవత్సరాలే. ఆ తర్వాత కంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పటికే తమ్మల తమ పార్టీలో చేరాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఆయన గనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తు గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇండిపెండెంట్ గా తుమ్మల పోటీ చేస్తే మాత్రం వెనుకబడి పోతారని తెలుస్తోంది.
షర్మిల, వీరభద్రం వస్తారా..
రీసెంట్ గా టీవైఎస్ఆర్ కాంగ్రెస్ నేత షర్మిల ఇక్కడ తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. పాలేరు నుంచే తాను పోటీ చేస్తానని, రాష్ట్ర నిర్మాణం పాలేరు నుంచే మొదలవుతుందని ఆమె ప్రకటించారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కిడి నుంచి ఆమెకు మద్దతు కూడా ఎక్కువగా కూడగట్టుకుంటుంది. తాను ఇక్కడి నుంచే గెలుస్తానని ధీమాగా చెప్తుంది ఆమె. ఇక మరో రాజకీయ ఉద్దండుడు సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం కూడా ఈ సెగ్మెంట్ నుంచే బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ సీపీఎం పొత్తులో ఉన్నాయి. దీనిలో భాగంగా ఇక్కడి టికెట్ తనకు కేటాయిస్తే పాలేరులో ఎర్రజెండా పాతడం ఖాయం అని ఆయన చూస్తున్నారు.
కన్ క్లూజన్..
పాలేరులో కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకూ 15 సార్లు అసెంబ్లీ స్థానానికి (బై పోల్ తో కలుపుకొని) ఎన్నికలు జరుగగా 10 సార్లు కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీనే విజయం సాధిస్తూ వస్తుంది. సీపీఎం రెండు సార్లు, టీఆర్ఎస్, సీపీఐలు అభ్యర్థులు ఒక్కో సారి గెలుపు సాధించారు. ఈ లెక్కన చూస్తే ఈ సారి కాంగ్రెస్ కు ఓట్లు ఎక్కువగా పడతాయని అనుకుంటున్నా.. తుమ్మల గనుక కాంగ్రెస్ కు వస్తే కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తుంది.