24 C
India
Sunday, October 11, 2026
More

    Visakhapatnam East : గ్రౌండ్ రిపోర్ట్.. విశాఖ తూర్పులో గెలుపెవరిది..?

    Date:

    Visakhapatnam East groun report
    Visakhapatnam East groun report

    Visakhapatnam East 2024 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు దృష్టి పెట్టాయి. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని వైసీపీ, మరోసారి విజయభావుటా ఎగురవేయాలని టీడీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఈ నియోజవకవర్గం టీడీపీకి కంచుకోట గా ఉంది. గత మూడు సార్లు ఇక్కడ ఆ పార్టీనే గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఆపార్టీ ఓట్లు చెక్కుచెదరలేదు. ఈ నియోజకవర్గంలో సుమారు 2,56,696 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,26,745 మంది పురుషులు, 1,29,931 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు.

    విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగినా, రామకృష్ణబాబు 26474 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి అక్కరమణి విజయనిర్మల మీద గెలిచారు. ఈ ప్రాంతంలో రామకృష్ణబాబుకు మంచి పట్టు ఉంది. మరే పార్టీకి కూడా ఇక్కడ సరైన అభ్యర్థి లేడు. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఏ వార్డులో అయినా వారిదే హవా ఉంటుంది. వెలగపూడి రామకృష్ణబాబు స్థానికులతో మంచి సంబంధాలు ఉండడం, ఆయన వారితో కలిసిపోతారనే పేరు ఉండడం మరోసారి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తున్నది.

    అయితే ఈసారి ఈ నియోజకవర్గం మీద వైసీపీ అధినేత జగన్ ప్రధాన దృష్టి పెట్టారు. ఈ సీటును గెలిపించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను ఇక్కడి నుంచి బరిలోకి నిలపాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణబాబు, ఎంపీ సత్యనారాయణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అయితే విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే యాదవ సామాజిక వర్గానికే ఈసారి టికెట్ ఇవ్వాలని వైసీపీలో డిమాండ్ మొదలైంది. వైసీపీ ఇన్చార్జిగా ఉన్న వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల మరోసారి బరిలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు   విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీలో నిలచేందుకు చూస్తున్నారు. అయితే వీరు ముగ్గురు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారు.

    ఇక్కడ బీసీలే 80 శాతం మంది ఉన్నారు.  అయితే ఈసారి యాదవ సామాజిక వర్గానికే ఇవ్వాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇక్కడ బలమైన క్యాడర్ ఉన్న వెలగపూడి రామకృష్ణబాబును ఢీకొట్టాలంటే బలమైన నేత కావాలని జగన్ చూస్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ ఎవరికి ఇస్తారో అని చర్చ కొనసాగుతున్నది. అయితే నియోజకవర్గంలో టీడీపీకి రామకృష్ణబాబు ఒక్కరే అంతా తానై నడిపిస్తున్నారు. కానీ వైసీపీలో వర్గ పోరు ఉంది. ఇదే టీడీపీ అభ్యర్థికి మరింత బలంగా మారుతున్నది. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటే, వెలగపూడి రామకృష్ణబాబు నాలుగోసారి కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tekkali Ground report : గ్రౌండ్ రిపోర్టు – టెక్కలిలో ద్విముఖ పోరే.. గెలుపుపై ఎవరి లెక్కలు వారివే..

    Tekkali Ground report టెక్కలిలో ప్రధాన అభ్యర్థులు వీరే.. టీడీపీ- కింజరపు అచ్చెన్నాయుడు(...

    Pawan : బీజేపీ కాదన్నా.. టీడీపీ కోసం పవన్ లాబీయింగ్..!

    Pawan ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన...

    YCP : క్లీన్ స్వీప్ అంటూ వైసీపీ గేమ్.. అయినా టీడీపీ వైపే బీజేపీ చూపు..

      YCP ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలుస్తామని వైసీపీ చెబుతున్నది. దీనికి...

    Bandi Sanjay : పొత్తులపై బండి సంజయ్ కీలక కామెంట్స్.. ఏమన్నారంటే..

    Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక...