- ఓ సంపన్న కుటుంబం బంపర్ ఆఫర్

One Crore Salary : ఇంటికి కాపలా ఉండే శునకానికి సంరక్షకుడు కావాలని బిలియనీర్ జాబ్ ఆఫర్ చేశాడు. ఇందుకు నెలకు అక్షరాల కోటి రూపాయ జీతం కూడా ఇస్తానని కూడా ప్రకటించాడు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది.
విశ్వాసానికి మారుపేరైన కుక్కను పెంచుకునేందుకు సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరూ ఇష్టపడుతుంటారు. దానిని తమ కుటుంబ సభ్యుడిలాగే భావిస్తారు.అవి కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను చూపిస్తాయి. అలాగే సెలబ్రిటీల ఇంట్లోని శునకాలకు మరో రేంజ్ ఉంటుంది. ఖరీదైన కుక్కలను పెంచుకుంటూ వాటిని అపురూపంగా చేసుకుంటారు.
వాటిని తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఇటీవల ఓ యువకుడు తన పెంపుడు కుక్క కోసం లగ్జరీ వసతులతో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఓ బిలియనీర్ తను పెంచుకుంటున్న కుక్కకు సంరక్షకుడు కావాలని, అందుకు రూ. కోటి జీతం ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అంతే కాకుండా ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం కూడా ఇస్తానని ప్రకటించాడు.
ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను చూసుకుంటే కోటి రూపాయలు ఇస్తానంటూ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. లండన్ కు చెందిన బిలియనీర్ తన కుక్కను చూసుకోవడానికి గాను నెలకు కోటి రూపాయల జీతం ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఈ జాబ్ కోసం ఇప్పటికే మూడు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయట.
ఆ జాబ్ కు సెలెక్ట్ అయిన వారు కుక్కకు ఆహారం అందించాలి. అది ఏమేం తింటుందో అవగాహన కలిగి ఉండాలి. దానికి స్నానం చేయించాలి, అనారోగ్యానికి గురైతే డాక్టర్ వద్దకు తీసుకెల్లాలి. నిత్యం అందుబాటులో ఉంటూ శునకం అవసరాలను స్వయగా చూసుకోవాలి. అలా పని చేస్తే కోటి రూపాయల జీతం తీసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి 42 రోజుల సెలవులు కూడా ఉన్నాయి. ఆ శునకాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తానని యాజమాని తెలిపాడు.






