Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకు మరింత వేడెక్కుతుంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. గుడివాడ అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యలకు వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ‘గుడివాడ మెదడు మోకాల్లో ఉంది ముద్ద పప్పుకు తక్కువ.. గన్నేరు పప్పు కి ఎక్కువ’ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శలు కురిపించారు.
గుడివాడ అమర్ నాథ్‌కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దళిత మహిళ అయిన తనపై మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వంగలపూడి అనిత అమర్ నాథ్ పై ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్‌లోనే కోడి గుడ్లు జారవిడిచి గుడ్డు పగులుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్డు మంత్రికి హ్యాండిచ్చారని అనిత ఆరోపించారు. కోడి గుడ్డు మంత్రి పని ముగిసిందని, గుడివాడకు నోటి దురుసు ఎక్కువ, అందుకే ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తనకు టీడీపీ నుంచి టికెట్ దక్కింది, కానీ గుడివాడ అమర్ నాథ్ కు వైఎస్ జగన్ టికెట్ ఇవ్వలేదని సెటైర్లు విసిరారు.
ఐటీ మినిస్టర్ గా చేస్తున్న గుడివాడ ఏపీకి ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ నైనా తెచ్చారా? అని అనిత ప్రశ్నించారు. దమ్ముంటే ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలని సవాల్ విసిరారు. ‘గుడివాడ నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? ఎక్కువగా మాట్లాడితే.. టీడీపీ, జనసేన సైనికులు నిన్ను తరిమికొడతారని. నేను ఆయన వ్యాఖ్యలపై మాట్లాడి గుడివాడ స్థాయి పెంచుతున్నాని ఫీల్ అవుతున్నా అన్నారు. పిడత పట్టుకొని.. మిడతలా కనిపిస్తున్నారు అమర్ నాథ్ అంటూ అనిత తీవ్ర స్థాయిలో విమర్ధించారు.