Bigg Boss Priyanka : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే రెండు వారాలు కూడా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ లో ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. వారిలో అప్పుడే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ లో 7 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు డేంజర్ లో ఉన్నారు.
ఇక మూడవ వారంలో కూడా పవర్ అస్త్రా కోసం హౌస్ లో టాస్క్ జరుగుతుంది.. ఈ పవర్ అస్త్రాను గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్ తమని తాము కంటెండర్లుగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరి మూడవ వారంలో బిగ్ బాస్ ఆనవాయితీ కంటిన్యూ చేసే హెయిర్ కట్ టాస్క్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎన్ని సీజన్స్ స్టార్ట్ అయ్యాయో అన్ని సీజన్స్ లో కూడా హెయిర్ కట్ ఆనవాయితీ అయితే ఉంది.
తాజాగా ప్రియాంక పవర్ అస్త్రా కోసం రేసులో ఉండేందుకు ప్రియాంక కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఈ హెయిర్ టాస్క్ ను ఫినిష్ చేసింది. హెయిర్ కట్ చేయించుకుని అందరికి షాక్ ఇచ్చింది. ప్రిన్స్ యావర్ తన ఛాలెంజ్ పూర్తి చేసాడు.. ఇక శోభా శెట్టి, ప్రియాంక కూడా పూర్తి చేసి కంటెండర్స్ గా నిలిచారు. కారం ఉన్న చికెన్ తినమని టాస్క్ ఇవ్వగా ప్రశాంత్, గౌతమ్ ఓడిపోగా శోభా శెట్టి ఈ టాస్క్ లో విన్ అయ్యింది.
ఇక అమర్ దీప్ కు ప్రియాంక జైన్ కు హెయిర్ టాస్క్ ఇచ్చాడు. అమర్ దీప్ కు పూర్తి గుండు చేయించుకోవాలని టాస్క్ ఇవ్వగా ప్రియాంకకు బాబ్ కట్ చేయించుకోవాలని చెప్పారు. ఈ టాస్క్ లో గుండు అనేసరికి అమర్ దీప్ తన వల్ల కాదని పక్కకు తప్పుకోగా ప్రియాంక మాత్రం హెయిర్ కట్ చేయించుకుని ఈ టాస్క్ లో విన్ అయ్యింది.
ఇలా ప్రియాంక, ప్రిన్స్, శోభా మధ్య పవర్ అస్త్రా కోసం పోటీ స్టార్ట్ అయ్యింది. ఇందులో ప్రిన్స్ ను వీరిద్దరూ అనర్హుడు అని చెప్పి ఎలిమినేట్ చేసారు. ఇదిలా ఉండగా ప్రియాంక జైన్ మాత్రం జుట్టు కత్తించుకుని తెగ సంబర పడింది. దీంతో ఈమెపై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. విక్రమార్కుడు సినిమాలో ఒక సీన్ ను వేసి ట్రోల్ చేస్తున్నారు.