
ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా శోభాయాత్ర ను భారీ ఎత్తున చేయాలని సంకల్పించింది భజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్. గౌలిగూడ లోని రామమందిర్ లో యజ్ఞంతో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమౌతుంది. ప్రారంభ వేడుకల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. హనుమాన్ శోభా యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. గౌలిగూడ నుండి సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వరకు ఈ శోభాయాత్ర జరుగనుంది. దాంతో వేలాది మంది పోలీసులు భద్రతా చర్యల్లో భాగం కానున్నారు.






