
Virat century : ప్రస్తుతం టాలీవుడ్ అగ్రకథానాయికగా కొనసాగుతుంది సమంత. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె వైవే అటెన్షన్ గ్రాబ్ అయ్యేలా చేసుకున్నారు సమంత. టాలీవుడ్ లో అడుగుపెట్టడం, అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకొని ఇటు అక్కినేని ఫ్యామిలీ, అంటు దగ్గుబాటి ఫ్యామిలీకి బంధువుగా ఉన్న ఆమె కొన్ని రోజులకే ఆ బంధుత్వం నుంచి బయటపడ్డారు. ఇక చైతూతో విడాకులు అయ్యాక ఆమె మరింత స్వేచ్ఛగా బతకడం మొదలు పెట్టారు. వయోసైటిస్ ఇబ్బంది పెడుతున్నా తట్టుకొని మరీ సినిమాలు చేశారు. పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా గుర్తింపు సంపాదంచుకున్నారు ఆమె.
ఐపీఎల్ కొనసాగుతున్న వెళ ఆమె విజయ్ దేవరకొండతో కలిసి స్టార్ స్పోర్ట్స్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనకు తెలిసినంత వరకు క్రికెట్ గురించి మాట్లాడింది సమంత. విజయ్ తో కలిసి కామెంట్ రూమ్ లో సందడి చేసింది. ఐపీఎల్ లో తన ఫెవరేట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పారు సమంత. ఇక ఇష్టమైన క్రికెటర్ అంటే.. ఎంఎస్ ధోని అని చెప్పుకచ్చారు. ఇంతటి స్టార్ క్రికెటర్ ఫ్యాన్ అయినా నేను ఎక్కువ విషయాల్లో విరాట్ కొహ్లీని చూసి స్ఫూర్తి పొందానని చెప్పుకచ్చింది.
విరాట్ కొహ్లి ఫామ్ కోల్పోయినప్పడు చాలా బాధపడేదాన్ని.. ఇటీవల ఆయన ఫాంలోకి వచ్చి సెంచరీ కొట్టినప్పుడు ఆనంద భాష్పాలు వచ్చాయని చెప్పారు ఆమె. విజయ్ దేవరకొండతో కలిసి సమంత ప్రస్తుతం ‘ఖుషి’ షూటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత సాఫ్ట వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తుందని మేకర్స్ పోస్టర్ ద్వారా చెప్పారు.