HBD Dr Jai పుట్టిన జన్మకు సార్థకత లభించినప్పుడే ఆ జన్మకు అర్ధం …… పరమార్థం. అలాంటి జన్మను పొందిన డాక్టర్ జై యలమంచిలి గారు నిజంగా అభినందనీయులు. తాను బ్రతకడమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా మెరుగైన జీవితాన్ని పొందాలని పరితపిస్తున్న వ్యక్తి , సమ్మోహన శక్తి డాక్టర్ జై యలమంచిలి గారు.
ఆంధ్రాలోని బెజవాడ నుంచి మొదలైన డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారి ప్రస్థానం అకుంఠిత దీక్షతో తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడం కోసం అమెరికా వరకూ సాగింది. అగ్రరాజ్యం అమెరికాలో తన సత్తా చాటి , అద్భుతమైన ప్రతిభాపాటవాలతో అంచలంచెలుగా ఎదిగి అనేక సంస్థలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
అంతేకాదు తన జన్మ సార్ధకం చేసుకోవడానికి ఈ సమాజానికి ఏదైనా చేయాలని తీవ్రంగా మదన పడి సృష్టించిన యాప్ ” UBlood App ”. రక్తదాతల కోసం , రక్త గ్రహీతల కోసం ఏర్పాటు చేసిన ఈ యాప్ అచిర కాలంలోనే అందరి మన్ననలను పొందింది. రక్త దాతల , రక్త గ్రహీతల సమగ్ర సమాచారం ఒకే యాప్ లో ఉండటంతో ప్రజలకు ప్రయోజనకారిగా మారింది. ఇక ఈ యాప్ కు అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం విశేషం.
అటు సామాజికంగా.. ఇటు ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ జై యలమంచిలి గారి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం ..
Happy Birthday Dr. జై సార్