
జై శ్రీరామ్ ……జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతోంది యావత్ భారతం. శ్రీరామ్ నినాదాలతో యావత్ భారతం దద్దరిల్లుతోంది. పల్లెలు , పట్టణాలు , నగరాలు అనే తేడా లేకుండా అంతా రామమయమైపోయింది. ఎక్కడ చూసినా సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా చేయడానికి భారీగా సన్నాహాలు చేశారు. భక్తి పారవశ్యంతో సీతారాముల వారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
ఇక అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం , ఒంటిమిట్టలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోడీ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ లు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
సకల గుణాభిరాముడు శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శనీయమని , ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు, సోదరులు , సమాజం పట్ల అనుసరణీయ మార్గంలో పయనించాలని, మానవాళి సౌబ్రాతృత్వానికి పాటు పడాలని కోరారు ప్రధాని మోడీ.






