31.9 C
India
Sunday, April 19, 2026
More

    హరీశ్ రిజల్ట్ ఎక్కడ..? ఫలితాల్లో కనిపించని పేరు..!

    Date:

    Harish result
    Harish result, 10th results

    Harish result : రాష్ర్టాన్ని కుదిపేసిన టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ లీకేజీలో ఏ1గా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పేరును చేర్చింది. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అర్ధరాత్రి ఆయనను బలవంతంగా అరెస్ట్ చేశారు. కోర్టు సెలవులను చూసుకొని ఆయనను అరెస్ట్ చేసినట్లు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును హన్మకొండ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేసినా తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

    అయితే ఈ పేపర్ లీకేజీ హన్మకొండ రూరల్ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో జరిగింది. ఈ వ్యవహారంలో పదో తరగతి విద్యార్థి డీ హరీశ్ ను కూడా ముద్దాయిగా చేర్చారు పోలీసులు. అయితే దీనిపై ఆయనతో పాటు ఆయన తల్లి కూడా మీడియా ఎదుట కన్నీరు మున్నీరైంది. హరీశ్ కథనం ప్రకారం.. ’తాను పరీక్ష రాస్తుండగా ఒక వ్యక్తి తను కూర్చున్న సమీపంలోని కిటికీ వద్దకు వచ్చాడని, అప్పుడు జరుగుతున్న హిందీ పరీక్షకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సిందిగా కోరాడని, ఇవ్వనంటే చంపుతానని బెదిరించాడని భయంతో ఇచ్చినట్లు చెప్పాడు. అయితే సదరు వ్యక్తి ఆ పేపర్ ను సెల్ ఫోన్ లో ఫొటో తీసుకొని మళ్లీ తన పేపర్ తనకు ఇచ్చి వెళ్లిపోయినట్లు’ మీడియా ముందు చెప్పాడు.

    తన కొడుకును చంపుతానంటే భయంతోనే పేపర్ ఇచ్చాడని వాపోయింది. అయితే తర్వాతి రోజు పరీక్షకు వెళ్తే తనను పరీక్ష రాయనీయకుండా డిబార్ చేసినట్లు చెప్పి పంపించారన్నారు. డిబార్ చేసి మహేశ్ భవిష్యత్ ను నాశనం చేయద్దని మీడియా ఎదుట రోధిస్తూ వేడుకుంది. ఇది చూసిన రాష్ట్ర ప్రజలు, విపక్షాలు మహేశ్ ను నిందితుడిగా చేర్చవద్దని, అతన్ని పరీక్షలు రాయనియ్యాలని డిమాండ్ చేశాయి. అధికారులపై ఒత్తిడి తీవ్రంగా రావడంతో అతన్ని తర్వాత పరీక్షలు రాయనిచ్చారు.

    అయితే బుధవారం (మే 10) రోజున విడుదల చేసిన టెన్త్ ఫలితాలలో మహేశ్ పేరు లేదని అతని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు కూడా తెలపడం లేదని విద్యార్థి నాయకులు అన్నారు. దీనిపై ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ రాష్ర్ట విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మహేశ్ భవిష్యత్తు నాశనం చేయద్దని, ఆయన సప్లిమెంటరీ రాసుకునేందుకు అకాశం కల్పిస్తూ.. ఏఏ సబ్జెక్టులో ఎన్నె్న్ని మార్కులు వచ్చాయో తెలపాలని కోరాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...