
Harish Shankar : గత కొంత కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుండి వైవిధ్యమైన సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.. అవి తెలుగులో కూడా డబ్ అయ్యి ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కాబోతుంది.. కేరళ పరిశ్రమ నుండి వచ్చిన సంచలన మూవీ ”2018”.. టోవినో థామస్, జాతీయ అవార్డు విజేత అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకు వస్తున్నారు.
2018 పేరుతోనే తెలుగులో కూడా ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు.. కేరళలో 2018లో వరదలు ఎలాంటి బీభత్సం సృష్టించాయో అందరికి తెలుసు.. ఎంతో మంది ప్రజలు రోడ్డున పడ్డారు.. ఈ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా తెలుగులో బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ భాగం కూడా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈయన కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో హరీష్ ఒక రిపోర్టర్ పై సీరియస్ అయ్యారు.. జర్నలిస్ట్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న ఈయనకు కోపం తెప్పించింది.. ఇలాంటి సినిమాలు చేసేందుకు తెలుగు హీరోలు, దర్శకులు అంగీకరిస్తారా అని ఆయా అడుగగా హరీష్ సీరియస్ అయ్యారు.. ఆ జర్నలిస్ట్ కు కౌంటర్లు ఇచ్చారు.
‘వినేవాడు సురేష్ అయితే చెప్పే వాడు హరీష్ అంట అని సెటైర్ వేశారు.. సురేష్ అడిగిన ప్రశ్న నాకు నచ్చలేదు అని హరీష్ తెలిపారు.. టెక్నాలజీ వల్ల వరల్డ్ సినిమా మొత్తం అరచేతుల్లోకి వచ్చేసింది ఇంకా డబ్బింగ్ సినిమాలంటూ వేరుచేయడం ఏంటి అంటూ ఈయన ప్రశ్నించారు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలను నార్త్ ఇండియా ఆడియెన్స్ డబ్బింగ్ సినిమాలు అనుకున్నారా.. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కావాలంటే ఎంతసేపైనా మాట్లాడుకుందాం.. నేను కధలను అంటూ హరీష్ సీరియస్ అయ్యారు..