34.1 C
India
Saturday, April 20, 2024
More

    Asia : ‘ఆసియా’కు పాకిస్థాన్ దూరమయ్యిందా..?

    Date:

    Asia cup
    Asia cup 2023
    Asia Cup 2023 : ఆసియాకు పాకిస్థాన్ దూరవమడం ఏంటి అనుకుంటున్నారా.. నిజమే.. క్రికెట్ అభిమానులకు ఇదొక కిర్రెక్కించే వార్త.  విషయమేంటంటే asia కప్ 2023 నిర్వహణకు పాకిస్థాన్ దూరమైనట్లే కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ క్రీడా సంబురం పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ టోర్నీపై అనిశ్చితి నెలకొని ఉంది.

    ఇందుకు దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే కారణమని అంతా భావిస్తున్నారు..
    పాక్ లో ఆడలేం.. బీసీసీఐ పాకిస్థాన్ లో తాము క్రికెట్ ఆడే పరిస్థితి లేదని బీసీసీఐ చెబుతోంది. ఇందుకు ప్రధానంగా తమ ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని పేర్కొంటున్నది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. భారత్ మ్యాచ్ లను తాత్కాలిక వేదికలపై నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించింది. మిగతా మ్యాచ్ లను మాత్రం తమ దేశంలోనే నిర్వహిస్తామని పేర్కొంది. దీనిని కూడా భారత్ వ్యతిరేకించగా, ఇందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మద్దతు తెలిపాయి.

    ఈ నేపథ్యంలో ఆసియా కప్ ను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తే పాకిస్థాన్ కు ఇది చేదు వార్తే. భారత్ కనుక ఆసియా కప్ ను బహిష్కరిస్తే,  తాము ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్
    లో ఆడబోమని పాక్ వింత వాదనకు దిగింది. అయినా బీసీసీఐ మాత్రం ఆసియా కప్ కోసం పాక్ కు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. దాయాదుల పోరంటేనే రెండు దేశాల్లో పుట్టే వేడి వాతావరణం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న పరిస్థుతుల్లో భారత్ జట్టు పాక్ కు వెళ్లకపోవడమే మంచిదని భారత అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఈనెలాఖరులో ఆసియాకప్ నిర్వహణపై కౌన్సిల్ తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో అభిమానుల దృష్టంతా అటు వైపు పడింది.
    భారత్, పాక్ మ్యాచ్ అంటేనే..
    మొదటి నుంచి రెండు దేశాల మధ్య పోరంటేనే ఒక పెద్ద ప్రహసనం. రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. గతంలో జరిగిన పరిణామాలు కూడా ఇందుకు ఆజ్యం పోస్తాయి. ఇక ఓడిన జట్టుపై వచ్చే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ వార్ రెండు దేశాల అభిమానుల మధ్య ఆత్మగౌరవ సమస్యగా మారిపోతుంది. ఏదేమైనా ఈ సారి దాయాదులు తలపడుతాయా.. టోర్నీనే రద్దవుతుందా అనే సంశయం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది. త్వరలోనే ఈ ప్రశ్నకు బదులు దొరికే అవకాశం ఉంది. ఒకవేళ టోర్నీ రద్దయినా ఐదు జట్లతో తామే మరో టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించడం అభిమానులకు పెద్ద ఊరట.

    Share post:

    More like this
    Related

    SRH Vs DC : సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పై పెరిగిన అంచనాలు

    SRH Vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Weather Report : వర్షాలపై వాతావరణ శాఖ తీపి కబురు

    Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి...

    Apply Vote : ఓటరు నమోదుకు మరో ఐదు రోజులే..ఫోన్ లోనూ చేసుకోవచ్చు..

    Apply Vote : మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి...

    17 Marriages : ఒకే కుటుంబం.. ఒకేసారి 17 మందికి పెళ్లి!

    17 Marriages : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’...