Modi : 2023 ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చేరింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై సగానికి పైగా సాట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మోడీ చేతుల్లోకి వెళ్లిందన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ వీడియోలో పూర్తి సారాంశం ఉంది.
తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదని మోడీకి మొదటి నుంచే తెలుసు. అయితే బీఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ ను ఫాంలోకి తేవాలి. అందుకు మొదటి అస్త్రంగా కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ కోరాడని చెప్పడం.. అది నిజమని సాక్షాలు సైతం బయటకు రావడంతో ఒక కొన్ని ఓట్లను బీజేపీ బీఆర్ఎస్ నుంచి దూరం చేసింది. దీన్ని కాంగ్రెస్ బాగా ఓన్ చేసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసింది. దీంతో ఫస్ట్ ఆఫ్ విజయవంతంగా కంప్లీట్ చేశాడు. ఇక సెకండ్ మేడిగడ్డ రిపోర్ట్, రైతు బంధు లాంటి స్కీమ్ ఆపివేయించడంపై మోడీ సర్కార్ విజయం సాధించిందన్న రూమర్లను బీఆర్ఎస్ క్రియేట్ చేసింది. కానీ ఫలితం మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు అదాని కాంపెనీలకు చెందిన వారు తెలంగాణకు పంపించి తెలంగాణలో కంపెనీలు పెట్టాలని మోడీ చెప్పినట్లు ఒక వీడియో క్రియేట్ అయ్యింది. ఆ రోజు బీఆర్ఎస్ అదానీని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వలేదు. కానీ ఈ రోజు అదాని కంపెనీతో సీఎం సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు అదాని కంపెనీ చేతిలోకి వెళ్తుంది.. దీంతో పాటు రైతుల కరెంట్ మోటార్లకు అదాని మీటర్లు వస్తాయని ఈ వీడియో ప్రస్తుతం ఆలోచనలను రేకెత్తిస్తుంది.