Hats off to Chandrababu : మాకు మళ్లీ మళ్లీ ఆయనే కావాలి.. దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. ఆయన లేకుంటే ఏమై పోయే వాళ్లమో.. ఈ మాటలు ఇప్పుడు విజయవాడ ముంపు బాధితుల ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాటలు.. ఆంధ్రప్రదేశ్ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు వారం రోజులుగా అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. జలదిగ్బంధంలో కూరుకుపోయిన విజయవాడను కాపాడేందుకు ఆయన అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటికి వెళ్లకుండా కలెక్టరేట్‌లోనే బస చేసి బస్సులోనే నిద్రిస్తూ ప్రజల కోసం శ్రమించారు. వరుసగా అధికారులతో సమావేశమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కలెక్టరేట్‌లోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ‘ప్రజలు ఇంటి నుంచి బయటకు సరదాగా వచ్చి వెళ్లే వరకు నా ఇల్లు కలెక్టర్ కార్యాలయమే!’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. బాధితులను ఆదుకునేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడంపై దృష్టి సారించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలన్నారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఆహారం గడప గడపకు వెళ్లే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోలలు ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంప, కిలో చక్కెర అందించాలి’ అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అర్థరాత్రులు విజయవాడకు సాయం అందించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తారు. లారీలు, ట్రాక్టర్లు, చిన్న ట్రక్కులు, ప్రభుత్వ వాహనాలు ఇలా ప్రతి దాంట్లో ప్రజలుకు సరిపడా నిత్యావసరాలను బాధితులకు అందించేందుకు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు సరుకులను తీసుకొచ్చాయి. వేల సంఖ్యలో పోలీసులను సహాయక చర్యల కోసం మోహరించారు.
ఆపద అనగానే అరక్షణంలో వాలిపోయిన చంద్రబాబును చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రే కలకాలం తమకు కావాలని కోరుకుంటున్నారు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. నష్టాన్ని వివరించి కేంద్ర నుంచి సాయం కోరారు. ఆహారం, నీరు, బిస్కెట్లు, పాలు, అరటిపండ్లు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అన్ని అంబులెన్స్‌లు పూర్తిగా అందుబాటులో లేవు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు యుద్ధంలా జరగాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.