“Hatya” Movie :
‘విజయ్ ఆంటోనీ’ సెన్సేషనల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. డాక్టర్ సలీమ్, బేతాళుడు, బిచ్చగాడు, బిచ్చగాడు 2 ఇలా ఒక్కో సినిమా ఒక్కో జానరల్ లో సాగుతుంది. ఏ జానర్ అయినా ఆయన మేకింగ్, యాక్షన్ గురించే మాట్లాడుకుంటారు సినీ అభిమానులు. సౌత్ లో మంచి క్రేజ్ మీదున్న హీరోల్లో విజయ్ ఆంటోని ఒకరు.
ఆయన హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ సినిమానే ‘హత్య’. ఈ నెల (జూలై) 21న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీలో ఆయన డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పోలీస్ ఆఫీసర్ గా పాత్రలో రితికా సింగ్ నటిస్తున్నారు. లోటర్ పిక్చర్స్ తో కలిసి ‘ఇన్ఫినిటీ ఫలిం వెంచర్స్’ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.
కమల్ బోరా, ప్రదీప్ బీ, జీ ధనుంజయన్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, పంకజ్ బోరా, ఆర్వీఎస్ అశోక్ కుమార్, విక్రమ్ కుమార్, సిద్ధార్థ్ శంకర్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించారు. సరిగ్గా ఏడాది క్రితం ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఇందులో మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. విజయ్ ఆంటోనీ కేరీర్ లో ఇదో డిఫరెంట్ జానర్ అని తెలుస్తుంది.
‘1923లో ప్రపంచాన్ని కుదిపేసిన ‘డోరతీ కింగ్ మర్డర్’ నేపథ్యంగా ‘హత్య’ తీసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కీలక పాత్రల్లో జాన్ విజయ్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, సంకిత్ బోరా, కిశోర్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ‘ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్’ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ‘హత్య’తో వీరు సినీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అడవి శేషు హాజరయ్యారు. బిచ్చగాడు 2 రిలీజ్ సమయంలో ఫస్ట్ టైం విజయ్ ని కలిశాను. ఆ సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నా.. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. బహుషా విజయ్ తన సినిమా లాభాల్లో తనకు సగం వాటా ఇవ్వాలని చమత్కారంగా అన్నారు. కాగా ఈ మూవీ 21న రిలీజ్ కానుంది.
https://twitter.com/NtvTeluguLive/status/1680619589879693315