డైరెక్టర్: బాలాజీ కే కుమార్
నిర్మాతలు: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ & లోటస్ పిక్చర్స్
మ్యూజిక్ డైరెక్టర్: గిరీష్ గోపాలకృష్ణన్
సినిమాటోగ్రాఫర్: శివకుమార్ విజయన్
ఎడిటర్: సెల్వ ఆర్కే
బిచ్చగాడు 2 సక్సెస్‌తో దూసుకుపోతున్న విజయ్ ఆంటోని ఇప్పుడు ‘హత్య’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చాడు. బాలాజీ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ
లైలా (మీనాక్షి చౌదరి) ఒక ప్రొఫెషనల్ మోడల్, ఆమె తన ఫ్లాట్‌లో హత్యకు గురవుతుంది. రహస్యం ఏమిటంటే, నేరం జరుగుతున్న సమయంలో ఆమె ఫ్లాట్ లోపలి నుంచి లాక్ ఉంటుంది. ఐపీఎస్ అధికారి అయిన సంధ్యా మోహన్ రాజ్ (రితికా సింగ్) ఈ కేసును టేకప్ చేస్తుంది. ఆమె తన మాస్టర్, ప్రైవేట్ డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోని) సాయం తీసుకొని కేసును పరిష్కరిస్తుంది. వినాయక్ మొదట్లో విభేదించినప్పటికీ, హత్య మిస్టరీ ఇంటస్ట్రింగ్ గా ఉందని ఆమెతో కలిసి పని చేసేందుకు ఒప్పుకుంటాడు.
సంధ్య, వినాయక్ లైలా మేనేజర్‌గా నటిస్తున్న బబ్లూ (కిశోర్ కుమార్), లైలా ప్రియుడు సతీశ్ (సిద్ధార్థ శంకర్), ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవన్ (అర్జున్ చిదంబరం), మోడలింగ్ కంపెనీలో పనిచేసే ఏజెంట్ ఆదిత్య కౌషిక్ (మురళీ శర్మ)ను అనుమానిస్తారు. లైలాను ఎవరు చంపారు అనేదే సినిమా.
ప్లస్ పాయింట్లు
అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ కారణంగా హత్య పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బెస్ట్ ఇన్వెస్టిగేషన్. సంధ్య, వినాయక్ కేసును ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్ట్ లు సినిమాకే హైలట్ గా నిలిచాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
సినిమాలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా నటించాడు. అతని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సహజంగా కనిపిస్తుంది. హత్య గురించిన గొప్ప విషయాల్లో ఒకటి అతని సూక్ష్మమైన ప్రదర్శన. విజయ్ ఆంటోని తన క్యారెక్టర్‌కు ఏది అవసరమో అది చేస్తాడు. అతిగా వెళ్లడు. అతను డైలాగ్స్ చెప్పే విధానం, చివరి మలుపుని రివీల్ చేసిన విధానం అద్భుతం. దర్యాప్తు మొత్తం నలుగురు అనుమానితులను చూపుతుంది. మీనాక్షి చౌదరి చుట్టే కథ తిరుగుతుంది. విజయ్ ఆంటోనీకి రితికా సింగ్ మంచి సపోర్ట్ ఇచ్చింది.
మైనస్ పాయింట్లు
సినిమా స్లో పేసింగ్ గా సాగుతుంది. ఒక పాయింట్ తర్వాత చికాకు కలిగిస్తుంది. ప్రారంభంలో, పాత్రలను పరిచయం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమా అదే మోషన్ లో వెళ్తుంది. విజయ్ ఆంటోని పాత్రకు సంబంధించిన కుటుంబ నేపథ్యం చూపడంతో కథ మలుపు తిరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించేందుకు ప్రయత్నించినా అది అవసరం అనిపించదు. మురళీ శర్మ, రాధిక శరత్‌కుమార్ పెద్ద స్టార్స్ అయినా వారిని అంతగా వాడుకోలేదు. అంత సీనియర్ నటుల తక్కువ నిడివి గల పాత్రల్లో కనిపంచారు. పైగా తెలుగు వెర్షన్ కు మురళీ శర్మ డబ్బింగ్ చెప్పలేదు. అద్భుతమైన పెర్ఫార్మర్‌కి డబ్బింగ్ సరిపోలేదు.
సాంకేతిక అంశాలు
సెకండాఫ్‌లో గిరీశ్ గోపాలకృష్ణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. రెట్రో స్టైల్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో పనిచేసింది. శివకుమార్ విజయన్ సినిమాటో గ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ వర్క్ సినిమాకు పూర్తిగా కొత్త టచ్ ఇచ్చినందున ఆర్ట్ డైరెక్షన్ సఫలమయ్యారనే చెప్పవచ్చు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ ఇంకాస్త బాటుండానలిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి.
దర్శకుడు బాలాజీ కే కుమార్ విషయానికి వస్తే, అతను సినిమాకు పెద్దగా శ్రమపడ్డట్లు కనిపించదు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగానే తీసినా.. సెకండాఫ్‌లో అనవసరమైన ఫ్యామిలీ ఎమోషన్ తీసుకువచ్చాడు. అది సినిమాను మరింత తక్కువ చేసి చూపింది. ఏది ఏమైనప్పటికీ, హత్య అతి పెద్ద లోపం గురించి మాట్లాడుకుంటే స్లో నారేషన్. అల్ట్రా-స్లో పేసింగ్ తో మంచి సన్నివేశాలు కూడా వాటి ప్రభావాన్ని కోల్పోయాయి.
తీర్పు
మొత్తం మీద, హత్య స్లో నేరేషన్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్, ఇది విజయ్ ఆంటోని అద్భుతమైన నటనపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పరిశోధనాత్మక భాగాలను చక్కగా చూపించారు. సెకెండ్ ఆఫ్ లో కుటుంబ భావోద్వేగాలతో కథ దారితప్పింది. హత్య మంచి థ్రిల్లర్ ఇస్తుంది కాబట్టి చూడవచ్చు.
ReplyForward
|