
Charan heroine : నేహా శర్మ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అంతగా మెరవలేక పోయింది. రామ్ చరణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాతో ఈమె ఎంట్రీ అదిరిపోయిన కూడా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు..
ఒకటి అరా సినిమాల్లో నటించిన ఈమెకు అంతగా పేరు రాలేదు.. అందుకే తిన్నగా ఫ్లైట్ ఎక్కేసి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడే అవకాశాల వేట మొదలు పెట్టింది. అవకాశాలు అయితే పొందగలిగింది కానీ వాటిని నిలుపు కోవడంలో విఫలం అయ్యింది. అక్కడ సూపర్ హిట్ పడకపోవడంతో బిటౌన్ లో కూడా అమ్మడి జోరు ఏ మాత్రం కనిపించలేదు.. దీంతో ఈమె రూటు మార్చేసింది.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంత కాదు.. సినిమా అవకాశాలు లేక ఈమె సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందుకే ఈమెకు సినిమాల క్రేజ్ కంటే కూడా సోషల్ మీడియా క్రేజ్ నే ఎక్కువ.. ఈ అందాలతో ఇప్పటికి అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది..
ఇదిలా ఉండగా ఈమె లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.. తాజాగా బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన ”జోగిరా సారా రా రా” అనే సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అమ్మడు టెంపుల్ కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. మరి ఈ సినిమా అయిన హిట్ అయ్యి మరిన్ని అవకాశాలు అందిస్తుందో లేదో చూడాలి..