
Mega Little Princess : రాం చరణ్-ఉపాసనల కూతురు మెగా ప్రిన్సెస్ ఫొటోను బయటకు రిలీజ్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున 1.47 గంటలకు ఉపాసన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన డెలివరీ అయ్యింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని నిన్ననే హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. అయితే లిటిల్ ప్రిన్సెస్ ను చూసేందుకు టాలీవుడ్ లోని ప్రముఖులు జూబ్లిహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు వస్తూనే ఉన్నారు. చిన్నారిని చూసి ఉపాసన-రాం చరణ్ కు విషెస్ తెలిపి వెళ్తున్నారు.
ఇక టాలీవుడ్ లోని టాప్ స్టార్లు, కో స్టార్లు చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, లావణ్య త్రిపాఠి ఇలా చాలా మంది ఈ జంటకు ట్విటర్ వేధికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరైతే మొదటి సంతానంలో పాప పుట్టింది ఇక రాం చరణ్ కెరీర్ కు తిరుగు ఉండదని చెప్తుంటే.. తన తండ్రి(చిరంజీవి)కి కూడా మొదటి సంతానం పాప కాగా ఆయన ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ అయ్యాడని, అలాగే రాం చరణ్ కూడా టాప్ స్టార్ అవుతాడని అంటున్నారు. ఇక చాలా సందర్భాల్లో రాం చరణ్ కూడా అమ్మాయి పుట్టాలని అనుకున్నాడు.
మెగా ప్రిన్సెస్ పిక్ బయటకు వచ్చింది. మంగళవారం పుట్టిన శిశువు ఫొటో అప్పుడో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఫొటోపై మెగా ప్రిన్సెస్ అని ఉండడంతో మెగా ఫ్యాన్స్ చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు. మెగాస్టార్ వారసురాలు కావడంతో తెగ సంబురపడిపోతున్నారు. మెగస్టార్ ఇంట ఇన్నాళ్లకు అడుగుపెట్టిన లక్ష్మీదేవిని చూసేందుకు ప్రతీ ఒక్కరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా షేర్ అవుతుంది.