Manisha Rani stunning looks :
ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుంటున్నారు. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు. ఈ భామలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ షేర్ చేసే లేటెస్ట్ అందాలకు యూత్ దాసోహం అవుతున్నారు..
సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా ఫోటో షూట్ లను వదులుతూ మిలియన్ ఫాలోవర్స్ ను పొందుతున్నారు. దీంతో వీరు ఎలాంటి గ్లామరస్ షో చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కుర్ర భామల నుండి సీనియర్ భామల వరకు హాట్ అందాలను ఆరబోయని భామలు లేరు.. మరి అందులో మనీషా రాణి కూడా ఒకరు.
ఈమె మారుమూల గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ బిగ్ బాస్ ఓటిటిలో సందడి చేస్తుంది.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఓటిటిలో ఈమె కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.. దీంతో ఈ భామ గురించి అంతా ఆరా తీయడం స్టార్ట్ చేసారు.
ఈమె సోషల్ మీడియాలో ఈ స్థాయికి చేరడానికి పడ్డ కష్టాలు వింటే ఒక సినిమాను తలపిస్తాయి.. ఈమెకు చిన్న వయసు నుండే కళా రంగం మీద మక్కువ ఉన్న ఆమె తండ్రి ఒప్పుకోలేదట.. అందుకే ఈమె పారిపోయి వచ్చి తనని తాను నిరూపించుకునే వరకు ఇంటికి వెళ్ళకూడదు అని అనుకుందట. ఏదో పనిచేసుకుంటూనే టిక్ టాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదే ఈమె జీవితాన్ని మలుపు తిప్పిందట. ఇక్కడ భారీ ఫాలోయింగ్ తెచ్చుకుని సెలెబ్రెటీగా మారిపోయింది.. ఇలా ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేవరకు వచ్చింది.