34.7 C
India
Friday, April 10, 2026
More

    ఆ హీరోయిన్ హత్య కేసులో అతడు నిర్ధోషి.. కోర్టు సంచలన తీర్పు..

    Date:

    jiah khan
    jiah khan and amitab

    అప్పట్లో సంచలనం సృష్టించిన జియాఖాన్ సూసైడ్ కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోళిని నిర్ధోషిగా తేల్చింది ముంబై సీబీఐ కోర్టు. ఆయన కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు ఎలాంటి ఆధారలు లేవని సూరజ్ నిర్ధోషి అంటూ కోర్టు స్పష్టం చేసింది.

    3 జూన్, 2013లో ముంబైలోని తన ఫ్లాట్ లో జియాఖాన్ సూసైడ్ చేసుకుంది. దానికి ముందు ఆమె ఆరు పేజీలు సూసైడ్ నోట్ కూడా రాసింది. జియాఖాన్ సూసైడ్ నోట్ ఆధారంగా అప్పట్లో పోలీసులు సూరజ్ ను అరెస్ట్ చేశారు. ఆమె రాసిన లేఖను బట్టి సూరజే నిందితుడని పోలీసులు పేర్కొన్నారు.

    ఈ కేసులో సూరజ్ కు వ్యతిరేకంగా పోలీసుల ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశ పెట్టకపోవడంతో  కేసు వీగిపోయింది. జియాఖాన్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని అభియోగం ఎదుర్కొంటున్న సూరజ్ ఆ పని చేయలేదని కోర్టు నమ్మింది. అయితే ఈ కోర్టు తీర్పున హీరోయిన్ జియాఖాన్ తల్లి హై కోర్టులో సవాల్ చేస్తానని చెప్పింది.

    అమితాబ్ తో కలిసి ‘నిశబ్ధ’ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది జియాఖాన్. మొదటి చిత్రం నుంచే మంచి నటన ప్రదర్శించిన ఆమె చేసింది మూడు సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే సూరజ్ పంచోళితో ప్రేమాయణం కొనసాగించారు. దాదాపు సంవత్సరం పాటు జియాఖాన్, సూరజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.

    కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె సూసైడ్ చేసుకుంది. దీనికంతటికి కారణం సూరజే అంటూ జియాఖాన్ తల్లి ఆరోపించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె రోధించారు. అప్పట్లో సూరజ్ కు అండగా సల్మాన్ ఖాన్ కూడా నిలుచున్నాడని వార్తలు వినిపించాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ఆ స్టార్ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. గుట్టు బయటపెట్టిన హీరోయిన్

    Heroine secrets Reveled : టాలీవుడ్ లో ఇటీవల గ్లామర్ తో...

    Heroine : ఒక్క హిట్టు లేకున్నా స్టార్ హీరోలకు ఈ బ్యూటీనే కావాలట?

    Heroine Minakshi Chowdary  : ప్రస్తుతం  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో...

    Heroine in caravan : క్యారవాన్ లోనే హీరో హీరోయిన్.. ఇదేం పాడు పనిరా బాబూ

    Heroine in caravan : సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్ల మధ్య...

    Heroine : ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. సినిమా చేయకుండానే పాపులార్ అయిన నటి ఈమెనే తెలుసా?

    Heroine : చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాఫులారిటీని సొంతం...