
Pawan-Renu separation : త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేశ్ ఇద్దరూ ఒకే హీరో ఫ్యాన్స్. కానీ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చాలా కాలం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేశ్ సెటైర్లు వేస్తూ.. విరుచుకుపడుతూనే ఉన్నాడు. తన దేవుడుగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ను తన నుంచి దూరం చేశాడని త్రివిక్రమ్ పై అక్కసు పెంచుకున్నాడు బండ్ల గణేశ్. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ బండ్ల గణేశ్ కు ఆహ్వానం పంపలేదు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య గొడవ మొదలైంది.
తను ఎప్పుడూ అభిమనించే, దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాటలు విని తనను దూరం పెట్టాడని బండ్ల త్రివిక్రమ్ పై ఆగ్రహంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్లు వేస్తున్నాడు. ఆయన కామెంట్లు ఎప్పుడూ వివాదాలకు దారి తీస్తూనే ఉంటాయి. గతంలో రోజాతో ఓ టీవీ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరుచుకుపడ్డారు.
గతంలో పవన్ కళ్యాణ్ భజన లేనిది బండ్ల గణేశ్ కు నిద్రపట్టేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పవన్ అంటేనే పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ట్విటర్ లో పవన్ ను ఆకాశానికి ఎత్తిన బండ్ల గణేశ్ ఇప్పుడు తన ట్విటర్ ఖాతాలో పవన్ కళ్యాన్ గురించి పోస్ట్ వేస్తే సెటైర్ తప్ప ఇంకోటి ఉండడం లేదు. దీంతో ఇద్దరి మధ్యా దూరం విపరీతంగా పెరిగిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గబ్బర్ సింగ్ వార్షికోత్సవం సందర్భంగా ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు బండ్ల గణేశ్.
పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేశ్ వెన్నుపోటు పొడుస్తారా అంటే అవుననే వినిపిస్తోంది. తను దేవుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా వార్షికోత్సవాన్ని ఫ్యాన్స్ సందడిగా చేస్తుంటే తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడు బండ్ల గణేశ్. ఈయన వ్యవహరించిన తీరును చూసే కొంత మంది ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బండ్ల గణేశ్ మరోసారి వివాదాల్లోకి ఎక్కారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని బండ్ల గణేశ్ ను ట్యాగ్ చేస్తూ ‘అన్నయ్య సినిమాకు నిర్మాత కావాలంటే ఎలా..?’ అంటూ అడిగాడు. సమాధానంగా బండ్ల గణేశ్ ‘గురూజీకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వు అప్పుడు తప్పక అవకాశం ఇస్తాడు’ అంటూ చెప్పాడు.
మరొక అభిమాని ‘గురూజీ పక్క ఇండస్ట్రీలోని సినిమాలను కాపీ కొట్టి తెలుగు లో తీస్తూ ఖూనీ చేస్తున్నాడు అంటగా’ అని అడుగగా, బండ్ల గణేష్ సమాధానం చెప్తూ ‘అదే కాదు భార్యా భర్తల్ని, తండ్రీ కొడుకులను, గురు శిష్యుల్ని ఎవరినైనా చేస్తాడు.. అదీ మన గురూజీ స్పెషాలిటీ’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక్కడ భార్యా భర్తలను అంటే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ని ఉద్దేశించి మాట్లాడాడని అర్థం అవుతుంది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేశ్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.