CM Jagan : మొదటి సారి ఏపీ సీఎం జగన్ బీజేపీపై మాట్లాడారు. బీజేపీ అండ లేకపోయినా గెలుస్తానని చెప్పుకొచ్చారు. పిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలతో కూడా తన రాజకీయాలు చెప్పుకున్నారయన. అది రాజకీయ సభ కాకున్నా స్కూల్ పిల్లలతో తన పరిస్థితి చెప్పుకున్నారు. దీంతో పాటు నా ధైర్యం మీరేనని.. మీరే అండగా నిలవాలని బతిమిలాడుకున్నారు.
అయితే ఆయన చంద్రబాబు, టీడీపీ పై విమర్శలకు ఎక్కువ సమయం కేటాయించారు. రెండు రోజులుగా బీజేపీ అగ్రనేతలు వచ్చి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీలో పర్యటించారు. ప్రభుత్వ అవినీతిపై వారు విరుచుకుపడ్డారు. కానీ వారిని పల్లెత్తు మాట అనకుండా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. తన కింది నేతలతో మాత్రం తిట్ల దండకం మమ అనిపించారు. . ఎన్నికల ముందు వారిని తిట్టడం ఎందుకు అనుకున్నారో సైలెంట్ అయ్యారు. చంద్రబాబును మాత్రం ఒంటికాలుపై తిట్టి, అనాల్సిన మాటలన్ని అన్నారు.
ప్రస్తుతం టీడీపీ రాయలసీమ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అంటున్నదని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయాలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, మీడియా, దత్తపుత్రుడు ఆయన వెంట ఉండొచ్చు కానీ నా బలం ప్రజలేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు గెలిచాక మ్యానిఫెస్టోను అమలు చేయరని , కేవలం ప్రజలపై ఆయనకు ప్రేమ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జగన్ తీరు వైసీపీలోనూ చర్చనీయాంశమవుతున్నది. సభ పెట్టి తిట్టింది ఒకరయితే, జగన్ మాత్రం నిద్రలోనూ చంద్రబాబు పేరే తీస్తున్నారని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కు 2024 ఓటమి ఖాయమని తెలిసిపోయిందని, అందుకే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారని మండిపడుతున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో ఇప్పటికే జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు వామపక్షాలు కూడా చంద్రబాబు వైపే మొగ్గు చూపేలా కనిపిస్తున్నాయి ఇక మిగిలింది బీజేపీనే. నిన్నటి సభ ద్వారా అధికార పక్షానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ మూడు పార్టీలు కలిస్తే మాత్రం జగన్ కు ఎదురీత తప్పదు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన చంద్రబాబును కాకుంటే ఇంకెవరిని అనగలరు. ఆయన ఢీకొట్టేది 40 ఏండ్ల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తితో. ఆ అనుభం లెక్కలు, మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలరు. ఇలాంటి సమయంలో జగన్ టార్గెట్ ఒక్క చంద్రబాబే. బీజేపీని మాట అందామంటే, అసలే కేసుల కత్తి తనపై ఉంది. ఇప్పటికే చాలా కేసులు తనపై పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల మొదటికే ముప్పు వస్తుంది. మరో వైపు ఈసారి గెలవకపోతే చంద్రబాబు తన పార్టీని మొత్తం కకావికలం చేసే అవకాశం కూడా ఉంటుంది. టీడీపీ శ్రేణులు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కసిగా ఉన్నారు. వైసీపీలో ఆ కసి కనిపించడం లేదు. మేం అధికారంలో ఉన్నాం.. మాకేం అవుతుంది అంతా జగనే చూసుకుంటారనే భ్రమలో ఉన్నారు. మరి 2024లో జగన్ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారో చూడాలి.
|
ReplyForward
|






