
మనకు రాగులు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. ఇందులో ఉండే పోషకాలతో ఎన్నో లాభాలుంటాయి. రాగులను జావగా తయారు చేసుకోవచ్చు. రాగి సంకటి రాయలసీమలో బాగా ఫేమస్. రాగులతో రొట్టె చేసుకోవచ్చు. రాగులను పలు రకాలుగా ఉపయోగించుకుంటే మనకు ప్రయోజనాలు కలుగుతాయి. రాగుల్లో అమినోయాసిడ్స్ ఉంటాయి. వీటిని ట్రిస్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండటంతో ఆకలి తగ్గిస్తాయి. బరువును నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే రాగులను ఆహారంగా తీసుకోవాలి.
మధుమేహంతో బాధపడే వారికి రాగులు మంచి ఆహారం. రోజు రాగులతో చేసిన వాటిని తినడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పాయసం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఔషధంగా పని చేస్తుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎముకల పటుత్వం పెరుగుతుంది.
రాగి జావ తాగితే శరీరానికి శక్తి కలుగుతుంది. రాగుల్లో ఉండే పోషకాలు ఉంటాయి. విటమిన్లు ఎ,బి,సి పుష్కలంగా ఉండటం వల్ల మనకు ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాలేయంలో ఉన్న అదనపు కొవ్వును తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తాయి. ఇలా రాగులు మనకు చాలా రకాలుగా మేలు కలిగిస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వయసు పైబడినా ఆ చాయలు కనిపించకుండా పోతాయి. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గుతుంది. రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో అనిమియా నివారించడానికి సహకరిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు రాగులను ఆహారంగా తీసుకుంటే దానికి చెక్ పెట్టొచ్చు. ఇలా రాగులను మనం రోజు ఆహారంగా వీటిని తీసుకోవడం ఉత్తమం.