36.5 C
India
Friday, April 10, 2026
More

    నీరాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలుసా?

    Date:

    neera-drink
    neera-drink

    మనకు కిడ్నీల్లో రాళ్లు వచ్చాయంటే డాక్టర్ నీరా తాగాలని సూచిస్తాడు. నీరాకు అంతటి మహత్తర శక్తి ఉంటుంది. కల్లు వేరు నీరా వేరు. నీరాలో అల్కహాల్ ఉండదు. అందుకే దీన్ని వైద్యులుకూడా తాగాలని చెబుతారు. కానీ కల్లులో అల్కహాల్ ఉండటంతో అది తాగడం మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ట్యాంక్ బండ్ కింద నీరా కేఫ్ ను ఏర్పాటు చేసి నగర ప్రజల కోసం నీరా అందిస్తోంది.

    కల్లుకు నీరాకు తేడా ఏంటంటే నీరాలో సహజ చక్కెర ఉంటుంది. కల్లులో ఉండే చక్కెర కల్లుగా మారుస్తుంది. అందుకే కల్లు కంటే నీరా తాగితేనే మంచిదని చెబుతారు. ఈత, తాటి, ఖర్జూర, జీలుగ వంటి చెట్ల నుంచి నీరా తీస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే నీర తాగాలని అందరు ఇష్టపడుతుంటారు. దీనివల్ల చాలా లాభాలున్నాయి.

    నీరాను సూర్యోదయాకి ముందే తీస్తారు. ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు పెరిగితే నీరా కూడా కల్లుగా మారుతుంది. అందుకే ఉదయాన్ని తాగాలి. లేదంటే అది కల్లుగా మారితే తాగడం కష్టం. పుల్లగా అవుతుంది. కల్లులో అల్కహాల్ ఉంటుంది. దీంతో కల్లు తాగితే మత్తు వస్తుంది. నీరా తాగితే ఎలాంటి మత్తు ఉండదు. కొబ్బరినీళ్లలాగా తియ్యగా ఉండటంతో పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరు తాగుతుంటారు.

    నీరలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఎముకల పటుత్వానికి, ముసలి వాళ్లలో వచ్చే కీళ్లు, కాళ్ల నొప్పులను నివారిస్తుంది. వాంతులు, విరేచనాలు, కామెర్లు టైఫాయిడ్ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీపీ, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి వాటిని కూడా దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. నీరాతో ఇన్ని రకాల లాభాలున్నందున దీన్ని తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే...

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....