- బీఆర్ఎస్ టికెట్ కు ప్రయత్నాలు..?

Health Director Srinivas Rao: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా కరోనా సమయం నుంచి కీలకంగా మారిపోయారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. అయితే ఆయన ఆదివారం కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇది రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైంది.
కొత్తగూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని, 80 ఏండ్ల వయసులో ఇంకా రాజకీయాలు ఎందుకని అన్నారు. గతంలోనే ఇవి నాకు చివరి ఎన్నికలని మాట్లాడారని గుర్తు చేశారు. మంచి చేయాలని వస్తే అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరు సరిగా లేదని విమర్శించారు.
మరోవైపు తాను ఉల్వనూరు లో పుట్టానని , తన శరీరం ఇక్కడే కలిసిపోతుందని భావోద్వేగంతో మాట్లాడారు. ఇక కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామని మీరంతా కలిసి అక్కడున్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అయితే హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలు అటు కొత్తగూడెంలోనే కాకుండా ఇటు రాష్ర్టవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇటీవల హెల్త్ డైరెక్టర్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పలు మార్లు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసి తన మనసులో మాట చెప్పారట కూడా. ఈ మేరకు అధిష్టానం కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఎన్నికలకు ఐదు నెలలే ఉండగా , సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఈ ఉన్నతాధికారి వ్యాఖ్యలను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందోనని అంతా అనుకుంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తుందోనని చర్చించుకుంటున్నారు.