
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. ఈ నెల 25న అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అవినాశ్ కు సూచించింది. అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధం అవుతున్నదన్న ప్రచారం నేపథ్యంలో ఏపీలోని కర్నూలు, కడప జిల్లాలో ని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మూడుసార్లు అవినాష్ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో సీబీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కర్నూలు లో వైసీపీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో తిష్ట వేశారు సోమవారమే అరెస్ట్ చేస్తారని భావించినా, స్థానిక జిల్లా పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి కర్నూలు కు కేంద్ర బలగాలు వస్తున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే అరెస్టుకు సీబీఐ వెనక్కి తగ్గడం, వైసీపీ శ్రేణుల తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎంపీకి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారని.. సామాన్యులకు ఇలా ఇస్తారా అని సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి
అవినాష్ రెడ్డి ప్రస్తుతం తన తల్లి చికిత్స పొందుతున్న దవాఖానలోనే ఉన్నారు. తన తల్లి పరిస్థితి సీరియస్ గా ఉందని తనకు విచారణ కు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని సిబిఐ ని అవినాష్ రెడ్డి కోరుతున్నారు. అయితే విచారణకు మూడోసారి కూడా గైర్హాజరవడం సిబిఐ సీరియస్ గా తీసుకుంది.
సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందట పిటిషన్ దాఖలు చేశారు. అది మంగళవారం విచారణకు రానుంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే వరకు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరారు మరి మంగళవారం అవినాష్ రెడ్డి పిటిషన్ పై వెకేషన్ బెంచ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.