Heat waves :
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు కలవరం కలిగిస్తున్నాయి. యూరప్, అమెరికా, చైనా తదితర దేశాల్లో త్వరలో హీట్ వేవ్ ఉంటుందని, అది భారత్ లో కూడా అగ్ని పుట్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడిది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై మన సైంటిస్టులు కూడా పరిశోధనలు చేస్తున్నారు.
అయితే వాతావరణం లో వేడి పెరిగినప్పుడు ఈ హీట్ వేవ్ ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కాలం ఉండవు. ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటుంది. దేశంలో కూడా ఈ హీట్ వేవ్ అనేది మూడు అంశాల ఆధారంగా ఉంటుంది. మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. భారతదేశంలో తీర ప్రాంతాల ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నా ఈ హీట్ వేవ్ పరిస్థితులు వస్తాయి. ఇక కొండ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు సెల్సియస్ ఉంటే కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం దేశంలో రుతుపవనాల రాక కారణంగా ఉపశమనం ఉంది. కానీ జనం కొంత ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. ఉష్ణోగ్రతల పెరుగుదలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇండియాలో దాని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు అని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే న్యూయార్క్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డేనియల్ హోల్డెన్ చెప్పిన ప్రకారం గ్లోబల్ వార్మింగే హీట్ వ్యాప్తి కారణమని తెలిపారు. భూతాపం వల్ల ఉష్ణోగ్రతలో నిరంతర పెరుగుదల ఉంటుందని చెప్పారు. అయితే ఇది ప్రపంచంలో పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందని, దీని కారణంగా మరణాల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు పంటలకు హానికరంగా మారుతుందని తెలిపారు. మే 2022లో ఐఎండీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2060 నాటికి భారత దేశంలో వేడిగాలులు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని తెలిపారు. మితిమీరిన వేడి తేమ మన ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల ప్రజల కంటి చూపు కూడా ఎక్కువ స్థాయిలో దెబ్బ తినే అవకాశం ఉంటుందని తాజా పరిశోధన రిపోర్టులో తేలింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.