
‘కుమారి 21ఎఫ్’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బేబీ హెబ్బాపటేల్.. తన నాటీ నాటీ అందాలను కుర్రకారుకు వింధు చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే గ్లామర్ పోస్టులకు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు.
వెండితెరపై సక్సస్ సాధించిన వారి కంటే తన అంద చందాలు, గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సక్సెస్ సాధించే హీరోయిన్స్ ఇప్పుడు అనేక మంది ఉన్నారు. హీరోయిన్ అయితే చాలు సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ప్లాట్ ఫారంపై తన అందాలను చూపుతూ తను కూడా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పుకుంటున్నారు.
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హెబ్బాపటేల్ తను అందాలను పరిచి యూత్ ను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ మూవీతో సినీ ప్రేక్షకులతో కనెక్టివిటీ పెంచుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తన వైపునకు తిప్పుకుంది.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లిస్ట్ గంపెడంత ఉన్నా.. ఇండస్ట్రీలో అవకాశాల లిస్ట్ గుప్పెడంత కూడా లేదు. కుమారి 21ఎఫ్ తర్వాత ‘ఈడోరకం ఆడోరకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలు అంతగా ఆడలేదు.
సినిమాల ఛాన్స్ లు రాకపోవడంతో ఐటం సాంగ్ లకు కూడా అమ్మడు ఓకే చెప్తుంది. ఇలా తన గ్లామర్ ను చూపిస్తూ యువతను తన నుంచి జారి పోకుండా కాపాడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికీ యాక్టివ్ గానే ఉంటుంది.
తాజాగా చీరకట్టులో అలరించింది ఈ చిన్నది. చీరకట్టులో కూడా సెక్సీగా కనిపించడంతో అమ్మడి బొమ్మలను నెటిజన్లు, ఆమె అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సొగసైన అందాలను చూపుతోంది. నడువంపులను, ఎద పొంగులను చూపుతున్న హెబ్బా యువతకు పిచ్చెక్కిస్తుంది. అందం.. దానికి తగ్గ నటన ఆమె సొంతం. దర్శక, నిర్మాతల చూపు హెబ్బాపై పడడం లేదు గానీ ఒక వేళ పడి ఉంటే గ్లామర్ పాత్రలైనా అమ్మడు ఇట్టే చేసేవారు.
ఇటీవల రామ్ పోతినేనితో కలిసి అమ్మడు డ్యాన్స్ చేసింది. ‘రెడ్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది మెప్పించింది. అయితే ఛాన్స్ ఇస్తే ఐటం సాంగ్ కైనా రెడీ అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.






