
Lower hypertension : ఈ రోజుల్లో హైపర్ టెన్షన్ (బీపీ) సర్వసాధారణంగా మారింది. అందరిలో ఇది కనిపిస్తోంది. దీంతో మందులు వాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీపీని కంట్రోల్ చేసుకునేందుకు నానా రకాల చర్యలు తీసుకుంటాం. బీపీతో చాలా ఇబ్బందులొస్తాయి. కళ్లు, కిడ్నీలు, లివర్, గుండె తదితర శరీర భాగాలు పాడై పోవడానికి పరోక్షంగా కారణమవుతుంది. ఈ నేపథ్యంలో బీపీని నిర్లక్ష్యం చేయకండి. సమయానుకూలంగా చికిత్స తీసుకుంటూ మందులు వాడుకోండి. లేకపోతే మనల్ని దహించే వ్యాధిగా దీన్ని చెబుతారు.
మనం తీసుకునే ఆహారాలు కూడా బీపీని అదుపు చేస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుకోవాలంటే చేపలు ముఖ్యమైన ఆహారం. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాట్ బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల మన ఒంట్లో రక్తప్రసరణ సరిగా జరిగేందుకు ఇవి దోహదపడతాయి. బీపీని కంట్రోల్ చేయడానికి ఇవి సాయపడతాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోవడం ఎంతో మంచిది.
మొలకెత్తిన విత్తనాలు బీపీని అదుపులో ఉంచుతాయి. ఇందులో అవిసె గింజలు, గుమ్మడిగింజలు, చియా విత్తనాలు బాగా ఉపయోగపడతాయి. హైపర్ టెన్షన్ ను కంట్రోల్ లో ఉంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం, అమైనో ఆమ్లాలు, నైట్రిక్ ఆక్సైడ్ వంటి పోషకాలు బీపీని నియంత్రణలో ఉంచుతాయి.
గ్రీన్ టీ కూడా బాగా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీని నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తుంది. గడ్డులోని తెల్ల సొన కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది. చిక్కుళ్లు కూడా బీపీని అదుపు చేస్తాయి. బెర్రీస్ కూడా బీపీని అదుపు తప్పకుండా ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీర్ఘకాలిక జబ్బులను కూడా ఇవి నయం చేస్తాయి.
కాలీఫ్లవర్, బ్రోక్ లీ, పాలకూర, క్యాబేజీ కూడా బీపీని నియంత్రణలోఉంచేందుకు సహకరిస్తాయి. అందుకే వీటిని కూడా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇలా బీపీని అదుపులో ఉంచే ఆహారాలు తరచూ తీసుకుంటూ హైపర్ టెన్సన్ ను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.