Bribery : చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఏపని జరిగేలా లేదు. ఇక్కడ ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది. ఈ ఆఫీసుకు రావాలంటేనే కొనుగో లుదారులు అమ్మకం దారులు భయం భయంగా రావాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎన్నో కఠిన ఆంక్షలు పెట్టి ఆన్లైన్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోండన్నా కొర్రీలు వేసి వచ్చే వారిని భయపెడుతూ తీరా ఆఫీసులో అడుగుపెట్టగానే డాక్యుమెంట్ రైటర్ వద్దకు పంపి తమ రిజిస్ట్రేషన్ చేపించుకోవాలని ఒక బినామీ వ్యక్తి ఆఫీసులో తిరుగుతూ ఉంటాడు.
0.5 ఇవ్వాల్సిందే:
డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్తే ఆఫీసుకు 0 .5% ఇవ్వాల్సిందేనని కరాకండిగా చెప్పి డాక్యుమెంట్ తయారుచేసి, ఆస్తి విలువ 10 లక్షలు ఉంటే రెండున్నర వేల రూపాయలు ఆఫీస్ లో ఇవ్వాల్సిందేనని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన వారి వద్ద తీసు కొని మరి సాయంత్రం కల్లా ఒక వ్యక్తికి అప్పజెప్తారు. సదరు చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న డాక్యుమెంట్ రైటర్లు. ఇక అలవి కానివి చేయకూడనివి వేరే సర్వే నెంబర్లు చేసేవి చాలానే జరిగాయనేది తెలుస్తుంది.
సర్వే నెంబర్లను మార్చి మరీ
రజక కాలనీ,సి ఆర్ కాలనీ చుట్టుపక్కల సర్వే నెంబర్లు మార్చి అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ కార్యాలయం వద్ద ఏ పని జరగాలన్న డబ్బు ఇవ్వాల్సిందే. జగనన్న ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకా ల్లో అవితి లేకుండా ప్రత్యక్షంగా చేరుతుందన్న మాట వాస్తవమే అయినా.. చిలకలూరిపేట ఈ కార్యాలయం వద్ద అడుగుపెడితే దళారులు డబ్బులు వసూలు చేసి కార్యాలయంలో ఇవ్వాలని ముక్కుపిండి మరి డబ్బు వసూలు చేస్తు న్నట్టు పలువురు వాపోతున్నారు. వసూలు చేసిన సొమ్మంతా పట్టణంలోని జాతీయ రహదారిపై ఔట్ కట్స్ లో ఒక వ్యక్తికి అందజేయడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే పి ఏ వద్ద లంచం పుచ్చుకున్న ఘనులు:
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజిని పి. ఏ చిలకలూరిపేట కార్యాల యానికి వస్తే ₹1000 లంచం అడిగి తీసుకొని మరి పని చేసిన ఘనులు చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది. ఆ దెబ్బతో కొద్దిరోజులు సెలవు పెట్టిన సబ్ రిజిస్టర్ తన రాజకీయ పలుకు బడిన ఉపయోగించుకుని ఒక ఎమ్మెల్సీ ద్వారా మళ్ళా చిలకలూరిపేటకు వచ్చి తన పనులు చక్కబెట్టుకుంటున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తమకు వచ్చిన జీరో పాయింట్ ఫైవ్ కమిషన్లో ఒక ప్రజా ప్రతినిధికి నెలకు 5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గుసగుసలు వెల్లువెత్తు తున్నాయి. జగనన్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతూ ఉంటే చిలకలూరిపేటలోని ఈ కార్యాలయంలో మాత్రం అవినీతి రాజ్యమేలు తుందని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.