
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆయన వెళ్లినట్లు సమాచారం. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ – ఆయన కుటుంబ సభ్యులతో గంటకు పైగా మాట్లాడారు. చాలా కాలంగా అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తే, ఇరు హీరోల అభిమానుల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోవచ్చని భావిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లకు ఎక్కువగా హాజరయ్యేవారు. ఈ తాజా పరిణామంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.