22.7 C
India
Tuesday, October 6, 2026
More

    Naveen Vijay Krishna : ఆ హీరో ఇప్పుడిలా మారిపోయాడు? గుర్తు పట్టారా?

    Date:

    Naveen Vijay Krishna : 

    సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోలుకొని మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన హీరోగా వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం బ్రో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన ఫ్రెండ్స్ తో కలిసి మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేశాడు. వాటిని చూసిన వారు అందులో మరో హీరో కూడా ఉన్నాడని కనుక్కున్నారు. అతనెవరో మీరైనా గుర్తు పట్టారా?

    ‘బ్రో: ది అవతార్’తో ప్రేక్షకుల్ని పలకరించిన సాయి ధరమ్ తేజ్.. తర్వాతి చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీనికి ‘గాంజా శంకర్’ అనే మూవీ టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యక ముందే ఓ షార్ట్ ఫిల్మ్‌తో ఆడియెన్స్ పలకరించబోతన్నాడట. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ముందే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు.

    ఆర్మీ జవాన్, అతడి ప్రేయసి మధ్య ఈ కథ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు సీనియర్ నరేశ్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సాయితేజ్ తో కలిసి ఎడమ నుంచి ఫస్ట్ వ్యక్తి బ్లూ కలర్ టీ టీషర్ట్‌లో ఉన్నది అతడే. గతంలో హీరోగా నందిని ‘నర్సింగ్ హోమ్’, ‘ఊరంతా అనుకుంటున్నారు’లో నటించాడు. ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే మూవీ కూడా చేశాడు. అయితే వీటితో ఆయనకు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేశాడు.

    ఇప్పుడు చాలా లావు కావడంతో నవీన్‌ను గుర్తుపట్టలేకపోతున్నారట. మరోవైపు సాయితేజ్, మంచు మనోజ్, నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. సమయం ఉన్నప్పుడల్లా ముగ్గురూ కలుసుకుంటారు. హీరోగా మెప్పించలేకపోయిన నవీన్ దర్శకుడి అవతారం ఎత్తారు. సాయి ధరమ్ తేజ్‌తో  షార్ట్ ఫిల్మ్ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ షార్ట్ ఫిలింను రిలీజ్ చేయనున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related