
Hero Nithin : యూత్ స్టార్ నితిన్ జయంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత దిల్ తో దమ్మున్న హీరోగా మారాడు. తనకు వచ్చిన హిట్స్ తో ఇండస్ర్టీలో నిలదొక్కుకున్నాడు. అయితే కొన్ని వరుస పరాజయాలతో కొంత కాలం వెనకబడినా ఇష్క్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. తరువాత గుండె జారి గల్లంతయిందే సినిమాతో కూడా తనలో టాలెంట్ ఉందని నిరూపించాడు.
సినిమాల ఎంపికలో మంచి కథలు ఉండేలా చూసుకుంటున్నాడు. దీంతో భీష్మ లాంటి సినిమా చేసి తనలో ఇంకా గట్స్ ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం కొత్త కథల కోసం వెతుకుతున్నాడు. మంచి కథ దొరికితే సినిమా తీయాలని చూస్తున్నాడు. దీని కోసం ఓ పవర్ ఫుల్ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈక్రమంలో వకీల్ సాబ్ తీసిని వేణు శ్రీరామ్ ను కలిసి కథ వినడంతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.
వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కోసం ఐకాన్ అనే కథను రాసుకున్నాడట. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. దీంతో దీన్ని నితిన్ హీరోగా తీయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. నితిన్ బాడీ లాంగ్వేజ్ కోసం కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నితిన్ కు ఈ కథ బాగా నచ్చిందని అంటున్నారు. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇదే జరిగితే నితిన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫామ్ లో ఉన్న నితిన్ మరోమారు తన సినిమాతో మంచి విజయం అందుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.