Hero Sunishith : సినిమా తారల జీవితాలు తెర ముందుకన్నా తెరవెనుకే గమ్మత్తయిన విషయాలు జరుగుతాయి. వారి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ హన్సిక కూడా ఇటీవల ఓ బాంబు పేల్చింది. ఓ హీరో తనను ఇబ్బంది పెట్టాడని డేటింగ్ రమ్మని వెంట పడేవాడని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతడెవరనే దానిపై నెటిజన్లు ఆసక్తి పెంచుకున్నారు. ఆమెను అంతలా ఇబ్బంది పెట్టిన అతడు ఎవరని ఆరా తీశారు.
దీనిపై వాదనలు నడుస్తుండగా హీరో సునిశిత్ ఆ వ్యక్తిని తానేనని బయట పడ్డాడు. తెలుగు ప్రేక్షకులకు హన్సిక బాగా తెలుసు. దేశముదురు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుంది. ముద్దుగా బొద్దుగా ఉండే ఆమెను చాలా మంది ఇష్టపడేవారు. ఈ నేపథ్యంలోనే సునిశిత్ ఆమె వెంట పడ్డాడని చెప్పడం గమనార్హం.
సునిశిత్ కు తగిన విధంగా బుద్ధి చెప్పానని కూడా వెల్లడించింది. ఆ హీరో పేరు మాత్రం హన్సిక చెప్పలేదు. కానీ అతడే బయట పడ్డాడు. హన్సికను డేటింగ్ కు పిలిచింది తానేనని చెప్పాడు. కొంతమంది చేస్తున్న ప్రచారంపై అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెబుతోంది. ఇష్టమొచ్చినట్లుగా రాయడంతోనే తాను బయట పడాల్సి వచ్చిందని అతడు చెబుతున్నాడు.
ఈ క్రమంలో సునిశిత్ ఆమె వెంట పడింది తానేనని వెల్లడించడంతో డేటింగ్ కథకు సుఖాంతం దక్కినట్లు అయింది. ఇన్ని రోజులు అతడు ఎవరనే దానిపై అందరు ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. ఇప్పుడు విషయం బయటపడటంతో అందరికి తెలిసిపోయింది. హీరోయిన్ల జీవితాలు కూడా ఇలాంటి మలుపులు తిరుగుతుంటాయి.