
Varun Sandesh injured : హ్యాపీడేస్ చిత్రం ద్వారా వరుణ్ సందేశ్ హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. అడపదడపా నటిస్తున్నాడు. పెళ్లయ్యాక అసలు సినిమాలే చేయడం లేదు. తన సహనటి వితికాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అతడు ఓ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో వరుణ్ గాయపడ్డాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ తో పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నాడు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ లో భార్యతో సందడి చేశాడు. ఇప్పుడు జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ది కానిస్టేబుల్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న షూటింగులో వరుణ్ కాలుకు గాయమైంది.
డాక్టర్లు కాలికి కట్టు కట్టి మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో షూటింగ్ అర్ధంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాను బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. కానిస్టేబుల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో సినిమా కొద్ది రోజులు వాయిదా పడనుంది. వరున్ సందేష్ సినిమాలకు దూరంగా ఉండటంతో లేకలేక ఈ సినిమా మొదలు పెడితే అది కాస్త వాయిదా పడింది.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు లవర్ బాయ్ గా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి సినిమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఇప్పుడు నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అన్నాడు. దీంతో వరుణ్ సందేశ్ లవర్ బాయ్ పాత్రల నుంచి బయటకు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనున్నట్లు చెబుతున్నాడు.