
Madhavilatha Sensational Comments :
ముఖ్యంగా టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వట్లేదనేది ఆమె వాదన. ఇందులో భాగంగానే ఆమె బిగ్ బాస్ పై తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ అనేది వంద శాతం ఒక కమర్షియల్ షో. అందులోకి సామాన్యులను పంపిస్తే ఎవరూ దేకరు. కాబట్టి కామనర్స్ అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టేయాలంటూ ఆమె సూచించింది.
ఎలాంటి కంటెస్టెంట్లను తీసుకుంటే బిగ్ బాస్ ను చూస్తారో నాగార్జున గారికి కూడా బాగా తెలుసు. కానీ అలాంటి వారు బిగ్ బాస్ లోకి రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నాలాంటి వారికి డబ్బుల కంటే ఇజ్జత్ చాలా ముఖ్యం. అందుకే అంతా బైబై చెప్పేశారు. కాబట్టి ఉన్న వారితోనే అడ్జస్ట్ అవుతున్నారు. నన్ను చూడమని అడగొద్దు అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
దాంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మాధవీలతను కూడా బిగ్ బాస్ లోకి చాలా సార్లు అడిగారు. కానీ ఆమె రావడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వలేదనే కోపం ఉంది. అందుకే ఆమె బిగ్ బాస్ లాంటి తెలుగు షోలను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలుగు హీరోయిన్ల రేంజ్ బిగ్ బాస్ తో సమానం అని చెప్పేందుకే ఈ షోలోకి తెలుగు హీరోయిన్లను తీసుకుంటున్నారనేది ఆమె వాదన.
ReplyForward
|