Prabhas Heroine : ప్రభాస్ ఇటీవల తన కొత్త సినిమా ఫౌజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఓ సంప్రదాయ నృత్యం తెలిసిన అమ్మాయి కావాలని .. డైరెక్టర్ ఏరి కోరి మరీ హిందీ అమ్మాయి.. ఇన్ స్టాగ్రాంలో ఫేమస్ అయిన ఇమాన్వీ అనే యువతిని హీరోయిన్ గా తీసుకున్నారు. అసలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక సాధారణ సోషల్ మీడియా అమ్మాయిని తీసుకోవడమే సంచలనమైంది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా పక్కన అవకాశం దక్కించుకున్న ఈ అమ్మాయి మంచి సంప్రదాయ డ్యాన్సర్. అయితే ఈ సినిమాకు ఆమెకు కేవలం రూ.20 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తున్నారట.. పైగా ఈ సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమా చేయడానికి వీల్లేదని ఒప్పందం చేసుకున్నారట.. అయితే ఈ సినిమా పూర్తి అయితే ఆమె దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోతుందని.. ఆ తర్వాత కోట్లు సంపాదిస్తుందని.. అందుకే ఇమాన్వి ఇప్పుడు తన ఫుల్ కాన్ సన్ ట్రేషన్ ఈ సినిమాపై పెట్టిందని టాక్.
View this post on Instagram