
Atidhi Rao Hydari Fire : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఈ మధ్య కాలంలో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ను మీడియాలో మారుమ్రోగేలా చేస్తున్నారు.. కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వరిస్తాయని చాలా మంది భామలు గొంతెత్తి మరీ చెబుతున్నారు.
మరి ఈ కాస్టింగ్ కౌచ్ ను కొంత మంది దైర్యంగా ఫేస్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం దీనికి ఎదురు తిరిగి పోరాడలేక ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ అనుభవాలను ఒక్కొక్కరిగా బయటకు వచ్చి పంచుకుంటుంటే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.
ఆమె ఎవరంటే అతిథి రావు హైదరీ.. ఈమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరిని ఎవరు నిందించాల్సిన పని లేదని దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఏదైనా సరే అమ్మాయిల బలహీనత మీదనే ఆధారపడి ఉంటుందని ఇష్టపూర్వకంగా కమిట్మెంట్స్ ఇవ్వడం ఎందుకు ఇచ్చిన తర్వాత దానిపై మాట్లాడడం ఎందుకు.. మనం బలహీనంగా ఉంటేనే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు..
అందుకే ముందు మనల్ని మనం స్ట్రాంగ్ గా ఉంచుకుంటే ఎవరికీ లొంగాల్సిన పని ఉండదు అని ఈ భామ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..