30.1 C
India
Sunday, April 19, 2026
More

    పవన్ కళ్యాణ్ తో నటించి కెరీర్ ముగించిన హీరోయిన్లు.. ఎవరంటే..

    Date:

    pawan heroine

    pawan heroineమెగా బ్రదర్ గా ఇండస్ట్రీకి వచ్చి తనదైన స్టయిల్ చూపి ఇండియాలోనే బిగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో ఒక్క సినిమా చాన్స్ వస్తే చాలనుకునే హీరోయిన్లు భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో అయినా చేయాలని కలలు కంటారు. ఇదంతా ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నార్మల్ హీరో మాత్రమే. పవర్ స్టార్ బిరుదు రాక ముందు వస్తున్న సమయంలో ఆయనతో పని చేసిన హీరోయిన్లు ఒక్క సినిమాతోనే తమ కెరీర్ ను ముగించేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు కొంత అప్రతిష్ట కూడా మూట గట్టుకున్నారు.

    అయితే ఇండస్ట్రీలో మూఢ నమ్మకాలకు బాగా విలువ ఇస్తారు. ముహూర్తం షాట్ కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఎండ్ షాట్ గుమ్మడి కాయ కొట్టే వరకూ నిర్మాతలు, దర్శకులు, నటులు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తారు. అంతెందుకు ఇప్పటికీ సినిమా రిలీజ్ శుక్రవారం మాత్రమే చేస్తారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైందని, ఆ రోజు రిలీజ్ చేస్తే కాసుల వర్షం కురుస్తుందనుకుంటారు. పవన్ తో ఒక్క సినిమా తీసిన తర్వాత వారి అదృష్టం బాగా లేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి తెలుసుకుందాం..

    పవన్ కళ్యాణ్ తో నటించి ఇప్పుడు ఇండస్ట్రీలో లేకుండా పోయిన 8 మంది హీరోయిన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

    సుప్రియ యార్లగడ్డ : దగ్గుబాటి ఫ్యామిలీకి బంధువైన సుప్రియ యార్లగడ్డ పవన్ కళ్యాణ్ తోని మొదటి సినిమాలో నటించారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో నటించిన సుప్రియ ఒక్క సినిమాతోనే తన యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ వేసింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

    దేవయాని
    దేవయాని తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తెలుగులోకి వచ్చే సరికి మొదట కొన్నింటిలో చేసినా తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’లో నటించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత 2, 3 సినిమాలు మాత్రమే తీసింది. ఇక వెండితెర నుంచి వెళ్లిపోయి బుల్లితెరపై అలరిస్తుంది.

    ప్రీతి జింగానియా
    ‘తమ్ముడు’లో పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసిన ఈ చిన్నది తర్వాత అధిపతిలో మోహన్ బాబుతో, నరసింహనాయుడులో బాలకృష్ణతో నటించి తన కెరీర్ ను ముగించింది. తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

    pawan heroine

    కీర్తిరెడ్డి : పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’లో నటించిన కీర్తిరెడ్డి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. మహేశ్ బాబు అక్కగా ‘అర్జున్’ సినిమాలో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ ను విడిచి వెళ్లారు.

    రేణు దేశాయ్ : పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రీ, జానీ సినిమాల్లో నటించింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తో ఇద్దరు పిల్లులకు జన్మనిచ్చిన రేణు దేశాయ్ వెండితెరకు పూర్తిగా దూరమైంది.

    నేహ ఒబెరాయ్ : ‘బాలు’లో పవన్ కళ్యాణ్ తో జతకట్టింది నేహ ఒబెరాయ్. ఇదే ఆమె చివరి చిత్రం తర్వాత ఆమె ఇండస్ట్రీలో కనిపించలేదు.


    మీరా చోప్రా : పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది మీరాచోప్రా. తర్వాత టాలీవుడ్ లో 1, 2 చిత్రాల్లో కనిపించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది.

    అంజలి లావానియా : పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో నటించిన అంజలి లావానియా ఇదే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇదే సినిమాతో ఎగ్జిట్ కూడా అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...