25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Heroes Villainism : తెరపై  హీరోయిజం.. తెర వెనుక విలనిజం

    Date:

    Star Heroes
    Heroes Villainism

    Heroes Villainism : భారతదేశంలో హీరోలను ఆరాధ్య దైవాలుగా భావిస్తుంటారు. తమకు నచ్చిన హీరో ఏం చేసినా గుడ్డిగా ఫాలో అవుతుంటారు. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి డైలాగ్స్ వరకు అన్నీ అనుకరించేస్తూ ఉంటారు. ఇక హీరోలను ఆరాధించే విషయంలో దక్షిణాదిన అభిమానులు ఒక అడుగు ముందే ఉంటారు. తమ హీరోను ఆరాధించడంతో పాటు తమ హీరోకు పోటీ అని భావిస్తున్న వారిపై లేని రూమర్లు క్రియేట్ చేస్తుంటారు.  వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి సైతం వెనుకాడరు. అయితే తెర మీద హీరోయిజం చూపించే హీరోలు తెర వెనుకు మాత్రం విలన్లుగా మారడం విస్మయానికి గురి చేస్తున్నది.
    సాధారణం ఒక హీరోహీరోయిన్ ఎక్కువ సినిమాలు చేస్తే వారి మధ్య ఏదో ఉందని గాసిప్స్ క్రియేట్ చేస్తుంటారు. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, లేదా వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులు సృష్టిస్తుంటారు. అయితే అది వారి వ్యక్తిగతం అని అభిమానులు మాత్రం పట్టించుకోరు.  దీనికి మీడియా సైతం మరింత మసాలా అద్దుతుంది. అదేదో నిజమే అన్నట్లుగా భ్రమింప జేస్తుంది. అయితే కొందరు హీరోహీరోయిన్ల సాన్నిహిత్యం ఇతరులకు ప్రమాదరకంగా మారుతున్నది. ఇదేమీ కొత్త కాదు. సినీరంగంలో ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే సోషల్ మీడియా ఫుణ్యమా అని అది మరింత స్ప్రెడ్ అవుతున్నది.

    ఇటీవల కన్నడ హీరో దర్శన్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఓ అభిమాని హత్య కేసులో నిందితుడంటూ హీరో దర్శన్ తో పాటు హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్ కు భార్య, కొడుకు ఉన్నారు. హీరోయిన్ పవిత్ర గౌడతో ఎప్పటి నుంచో ఎఫైర్ నడుస్తుందన్న  టాక్ ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి వ్యవహారాన్ని దర్శన్   భార్య సైతం తప్పుపట్టింది. పవిత్ర గౌడ కారణంగా తనను దూరం పెడుతున్నారంటూ మీడియా ముందుకు సైతం వచ్చింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగిందనే లోపు హత్య కేసు బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ ల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దర్శన్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడని, దీంతో సదరు హీరోయిన్ కు  అసభ్యంగా మెసేజ్ లు పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో దర్శన్ ఆగ్రహంతో తన అభిమానిని హత్య చేయించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్శన్, పవిత్ర గౌడతో పాటు హత్యలో ప్రమేయమున్న పలువురిని అరెస్టు చేశారు. ఈ ఒక్క వ్యవహారమే కాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయి.

    అలాగే మలయాళ హీరో దిలీప్ కూడా ఇలాగే జైలు పాలయ్యారు. దిలీప్ కి భార్య మంజు వారియర్ ఉండగా, కావ్య మాధవన్ తో అనే హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు. చివరకు భార్యకు విడాకులు ఇచ్చి కావ్యని పెళ్లి చేసుకున్నాడు దిలీప్.  ఆ తర్వాత కావ్యకి హీరోయిన్ భావనకు మద్య విభేదాలు రావడంతో గొడవ ముదిరింది. . కావ్యను సంతృప్తి పర్చడానికి ఏకంగా భావనను కిడ్నాప్ చేయించాడు. అంతటితో ఆగకుండా లైంగిక దాడి యత్నించారని భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ కేసులో దిలీప్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మాలీవుడ్ కొద్ది రోజులు అతడిని సినిమాల నుంచి బహిష్కరించింది కూడా.
    ఇక బాలీవుడ్  కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తక్కువేమీ కాదు. అప్పట్టలో ఐశ్వర్యతో ప్రేమ వ్యవహారం నడిపాడు. కానీ ఐశ్వర్యతో ఎవరైనా చనువుగా ఉంటే సహించే వాడు కాదని, వారందరితో సల్మాన్ గొడవపడ్డాడని అప్పట్లో రూమర్లు వచ్చాయి. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఐశ్వర్యకు దగ్గర కావడంతో తట్టుకోలేక దాడి చేశాడని, దీంతో ఐశ్వర్య అప్పటి నుంచి సల్మాన్ ను దూరం పెడుతూ వచ్చింది. తన కెరీర్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యింది.  అయితే ఇలాంటి తెరవెనుక బాగోతాలు ఎన్నో ఉన్నాయని, కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని ఫిలిం ఇండస్ర్టీలో చర్చ నడుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ 150 కోట్లు..కానీ ‘సికిందర్’ వసూళ్లు ఎంతంటే!

    Salman Khan : AR మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ చిత్రం, సల్మాన్...

    Salman Khan : సల్మాన్ ఖాన్ కంటే కార్తీక్ ఆర్యన్ ముందున్నాడా..?

    Salman Khan : భూల్ భులైయా 3, సింగం ఎగైన్ అనే...

    Salman Khan : సల్మాన్‌ ఖాన్‌ కు బెదిరింపులు.. అంత డబ్బులు ఇవ్వకుంటే.. అంటూ మెసేజ్ లు..

    Salman Khan : రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ...

    Salman Khan : సల్మాన్ ఖాన్ చుట్టూ ఎంత మంది బౌన్సర్లు ఉంటారో తెలుసా?

    Salman Khan : కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ నుంచి బాలీవుడ్...