Pushpa 2 Trolls : పుష్ప 2 ట్రైలర్ నిజంగా మెస్మరైజింగ్ గా ఉంది. చాలా కాలంగా పుష్ప 2ని బన్నీ సినిమాగా పరిగణిస్తున్న జనాలు ఈ సినిమా వెనుక సుకుమార్ చేసిన కృషి అంతా మరిచిపోతున్నారు. అలా చూస్తుంటే పుష్ప 2 ట్రైలర్ లో సుకుమార్ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. కానీ సాధారణంగా సౌత్ సినిమా రిలీజైతే మాములుగా వచ్చే నార్త్ ఇండియన్ ట్రోలింగ్ పెరిగింది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్ల వరకు జరిగింది.
పుష్ప 2 ట్రైలర్ బాగుందని ఎంత మంది మాట్లాడుకుంటున్నారో.. అలాగే ట్రోలింగ్ కూడా అలాగే జరుగుతుంది. ఈసారి బాలీవుడ్‌లోని ఓ మీడియా వర్గం పుష్ప 2 ట్రైలర్‌ను అధికారికంగా ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పుష్ప అనే పదానికి ఫైర్ అని అర్ధం కాకుండా వైల్డ్ ఫైర్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ సినిమాల్లో ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయని భావిస్తుంటే.. బిటౌన్ మీడియా ఈసారి ఘాటుగా స్పందిస్తోంది.
ఇప్పటికే సౌత్ హీరోల ఎదుగుదలను నార్త్ లో కొందరు తట్టుకోలేకపోతున్నారు. ఒకరు పైకి ఎదుగుతుంటే ఇంకొకరు తట్టుకోలేక బాలీవుడ్ బ్యాచ్ సౌత్ హీరోల సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. అలాగే పుష్ప 2 సినిమాలో రష్మిక కాళ్ల దగ్గర అల్లు అర్జున్ కూర్చున్న సీన్, రష్మిక బన్నీ మీద వాటర్ పోసే సీన్, పుష్ప రాజ్ సిగరెట్ వెలిగించుకునే సీన్లను ఎడిట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram